‘ది ఘోస్ట్’ (The Ghost) సినిమా ప్రేక్షకులకు నచ్చితే సీక్వెల్ తెరకెక్కిస్తాం: అక్కినేని నాగార్జున (Nagarjuna)

Updated on Oct 07, 2022 12:04 AM IST
అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా నటిస్తున్న ది ఘోస్ట్ (The Ghost) సినిమా  దసరా కానుకగా అక్టోబర్‌‌ 5వ తేదీన విడుదల కానుంది
అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా నటిస్తున్న ది ఘోస్ట్ (The Ghost) సినిమా దసరా కానుకగా అక్టోబర్‌‌ 5వ తేదీన విడుదల కానుంది

కింగ్ నాగార్జున (Nagarjuna) నటించిన కొత్త సినిమా ది ఘోస్ట్‌ (The Ghost). ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయ దశమి కానుకగా విడుదల కానుంది. పక్కా యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన ది ఘోస్ట్‌ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు నాగార్జున. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్, గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అక్టోబర్‌‌ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో వేగం పెంచింది చిత్ర యూనిట్.

ది ఘోస్ట్‌ సినిమా ట్రైలర్‌‌ లాంచ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడారు. తాను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్నానని, ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు నాగార్జున. మంచి కథ వస్తే పొలిటికల్‌ లీడర్‌గా నటించడానికి ఆసక్తిగా ఉన్నానని చెప్పార నాగ్. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ తాను పోటీ చేస్తాననే ప్రచారం జరుగుతోందని, అందులో నిజం లేదని తెలిపారు నాగార్జున.

అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా నటిస్తున్న ది ఘోస్ట్ (The Ghost) సినిమా  దసరా కానుకగా అక్టోబర్‌‌ 5వ తేదీన విడుదల కానుంది

ఆ రెండూ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు..

‘ది ఘోస్ట్‌  సినిమా ఒక సెంటిమెంట్‌తో స్టార్ట్ అయ్యింది. నాతో సినిమా తీయాలనేది నిర్మాత నారాయణదాస్‌ నారంగ్‌ గారి కోరిక. ఇటీవల ఆయన మరణించారు. ఆయన కొడుకు సునీల్‌ నిర్మాతగా ది ఘోస్ట్‌ సినిమా తెరకెక్కింది. సునీల్‌తోపాటు సినిమాను నిర్మించిన జాన్వీ, అదిత్‌, శరత్‌ మరార్‌, రామ్మోహన్‌కు థాంక్స్. కంటెంట్‌తోపాటు సాంకేతికంగా ఉన్నతంగా ఉంటేనే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారు. ఈ రెండింటితో దర్శకుడు ప్రవీణ్‌, అతని టీమ్‌ ‘ది ఘోస్ట్‌’ను తెరకెక్కించారని’ అన్నారు నాగార్జున.

‘సినిమాపై మాకు నమ్మకం ఉంది. ఈ సినిమాలో అన్ని ప్రాంతాలకూ చెందిన నటులు ఉన్నారు. గాడ్‌ఫాదర్‌‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవికి థాంక్స్‌. ఆయన చెప్పినట్టు అన్ని సినిమాలూ మంచి విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను గతంలో నటించిన ‘కిల్లర్‌’, ‘ది ఘోస్ట్‌’ సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు. ది ఘోస్ట్‌ సినిమాలో యాక్షన్‌తోపాటు ఎమోషన్‌ కూడా ఉంది. ది ఘోస్ట్‌ (The Ghost) సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తే సీక్వెల్‌ తెరకెక్కిస్తాం’ అని తెలిపారు నాగార్జున (Nagarjuna)

Read More : యాక్షన్ థ్రిల్లర్ గా నాగార్జున (Akkineni Nagarjuna) ‘ది ఘోస్ట్‌’ (The Ghost).. అదరగొడుతున్న రిలీజ్ ట్రైలర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!