TOLLYWOOD CELEBS : టాలీవుడ్‌లో వీళ్లిద్దరి మధ్య బంధుత్వం ఉందని మీకు తెలుసా!
సినిమా స్టార్ల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వాళ్లు చేసే సినిమాల గురించి తెలుసుకోవడంతోపాటు వ్యక్తిగత వివరాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు చాలామంది. అదే ఇద్దరు సెలబ్రిటీల మధ్య బంధుత్వం ఉందంటే.. అది ఏంటి.. ఆ రిలేషన్ ఎలా ఏర్పడింది.. అనే విషయాలపై ఆసక్తి మరింత పెరుగుతుంది.
టాలీవుడ్ (Tollywood)లో ఉన్న పలువురు సెలబ్రిటీల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి.. వాళ్లు ఎవరు అనే విషయాలు పింక్‌విల్లా ఫాలోవర్స్ కోసం..
గోపీచంద్ (Gopichand) – శ్రీకాంత్ (Srikanth)
తొలివలపు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. వర్షం, జయం, నిజం సినిమాలతో పాపులర్ అయ్యారు గోపీచంద్. అనంతరం యజ్ఞం, రణం, సౌఖ్యం వంటి పలు సినిమాలతో స్టార్ హీరోగా సక్సెస్ అయ్యారు. ఇక, చాలా ఏళ్ల నుంచి ఫ్యామిలీ హీరోగా అందరి మన్ననలు అందుకున్న శ్రీకాంత్.. ప్రస్తుతం విలన్‌గా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు.
హీరో గోపీచంద్, సీనియర్ హీరో శ్రీకాంత్ మధ్య చాలా దగ్గర సంబంధం ఉంది. గోపీచంద్ భార్య రేష్మకు శ్రీకాంత్ మేనకోడలు. శ్రీకాంత్ సొంత అక్క కూతురు అయిన రేష్మ అమెరికాలో చదువుకున్నారు. ఒక ఫోటోలో చూసి రేష్మను గోపీచంద్ ఇష్టపడ్డారని.. ఫ్యామిలీతో మాట్లాడి శ్రీకాంత్ వాళ్ల వివాహం జరిపించారని టాక్.
రామ్ పోతినేని (Ram Pothineni) – శర్వానంద్ (Sharwanand)
దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి ఎనర్జిటిక్ స్టార్‌గా ఎదిగారు రామ్ పోతినేని. తన స్టైల్, డాన్స్, నటనతో అభిమానులను అలరిస్తున్న రామ్.. ఇటీవలే ది వారియర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఇక, చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చి అభిమానులను అలరిస్తున్నారు యంగ్ హీరో రామ్ పోతినేని.
రామ్ – శర్వానంద్ మధ్య దగ్గరి బంధుత్వం ఉంది. రామ్ సోదరిని శర్వానంద్ సోదరుడు పెళ్లి చేసుకున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Sreenivas) – సిరివెన్నెల సీతారామశాస్త్రి
హిట్ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ, డైలాగ్స్‌తో అభిమానులను అలరించే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో సినిమా తీసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో సినిమా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. సిరివెన్నెల సినిమాలో పాటలు రచించి ఆ పేరునే ఇంటిపేరుగా చేసుకున్న రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మేనకోడలుని త్రివిక్రమ్ శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నారు.
సందీప్ కిషన్ (Sundeep Kishan) – ఛోటా కె నాయుడు
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం సందీప్ నటిస్తున్న మైఖేల్ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. సందీప్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు రిలేటివ్.
ఛోటా కె నాయుడికి స్వయానా మేనల్లుడు సందీప్ కిషన్.
పోసాని కృష్ణమురళి – బోయపాటి శ్రీను (Boyapati Srinu)
ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి. విభిన్నమైన నటనతో అందరినీ అలరించే పోసాని.. ముక్కుసూటిగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇక, హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు బోయపాటి శ్రీను.
బాలకృష్ణతో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు తీసి సూపర్‌హిట్స్ అందుకున్నారు. బోయపాటి శ్రీనుకి పోసాని కృష్ణమురళి కజిన్ అవుతారు.
పోసాని కృష్ణమురళి – కొరటాల శివ (Koratala Siva)
ఇండస్ట్రీలో పలు విభిన్నమైన క్యారెక్టర్లు పోషించి మంచిపేరు తెచ్చుకున్నారు పోసాని కృష్ణమురళి. తాజాగా పలు కామెడీ పాత్రల్లో కూడా నటించి మెప్పించారు. సమాజానికి మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ సినిమాలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ దర్శకుడు కొరటాల శివ. జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్, మహేష్‌బాబుతో భరత్ అనే నేను, మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రాంచరణ్‌తో ఆచార్య సినిమాలు తెరకెక్కించారు.
పోసాని కృష్ణమురళి సొంత అక్క కొడుకు కొరటాల శివ. పోసానికి కొరటాల మేనల్లుడు అవుతారు.
ఇక, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు ప్రముఖ డైరెక్టర్ మెహెర్ రమేష్ కజిన్ అవుతారు. ప్రముఖ నటుడు ఉత్తేజ్.. సుద్దాల అశోక్ తేజకు మేనల్లుడు. దర్శకధీరుడు రాజమౌళి భార్య రమకు ప్రముఖ దర్శకుడు గుణ్ణం గంగరాజు అన్నయ్య వరుస కాగా.. గుణ్ణం గంగరాజు భార్య సోదరుడు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి.
Read More : Tollywood Heroes : సినిమాలపై ఆసక్తితో సొంత బ్యానర్ పెట్టి నిర్మాతలుగా మారిన టాప్8 టాలీవుడ్ స్టార్ హీరోలు