Chiranjeevi: ఊర మాస్ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి.. అంచనాలు పెంచేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)!

Updated on Dec 16, 2022 06:09 PM IST
‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) నుంచి తాజాగా ఓ కొత్త పోస్టర్‌ విడుదలైంది. ఇందులో చిరు గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్‌గా కనిపిస్తున్నారు
‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) నుంచి తాజాగా ఓ కొత్త పోస్టర్‌ విడుదలైంది. ఇందులో చిరు గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్‌గా కనిపిస్తున్నారు

‘గాడ్‌ఫాదర్’ సక్సెస్‌తో జోష్ మీదున్న మెగాస్టార్ చిరంజీవి మరింత స్పీడు పెంచారు. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. చాన్నాళ్ల తర్వాత మెగాస్టార్ మాస్ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. 

‘బాస్ పార్టీ’ అంటూ ఇటీవల విడుదలైన సాంగ్ కూడా ‘వాల్తేరు వీరయ్య’పై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచింది. ఈ పాట మాస్ బీట్‌తో సాగుతూ ఆకట్టుకుంది. ఇందులో ఊర్వశి రౌటేలాతో కలసి చిరు వేసిన స్టెప్స్, ఆయన లుక్స్ వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తు చేశాయి. ‘బాస్ పార్టీ’ పాట తర్వాత రవితేజ (Ravi Teja) లుక్‌ను రివీల్ చేయడం ద్వారా ‘వాల్తేరు వీరయ్య’ టీమ్ ప్రమోషన్స్‌లో మరింత ఊపు తీసుకొచ్చింది. దీనికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ నుంచి మరో పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈసారి చిరు (Chiranjeevi)ను స్టైలిష్‌గా చూపించారు బాబి. చుట్టూ గన్స్.. మధ్యలో స్టైలిష్ గాగుల్స్‌తో స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తున్న మెగాస్టార్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హ్యాండ్ కఫ్స్‌ను ఒక చేతిలో పట్టుకున్న ఆయన లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ ఓ శాంపిల్ మాత్రమేనని, ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్‌లో పూనకాలు తెప్పించడం పక్కా అంటూ దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు. 

‘వాల్తేరు వీరయ్య’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ మూవీతోపాటు ‘వారసుడు’, ‘వీరసింహారెడ్డి’, ‘తునివు’ చిత్రాలు కూడా పండుగ రేసులోకి దిగుతున్నాయి. దీంతో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. బరిలో ఎక్కువ మూవీస్ ఉండటంతో పండుగ సెలవుల తర్వాత కూడా లాంగ్ రన్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. భారీ బడ్జెట్లతో తీస్తున్న సినిమాలు కాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. లాంగ్ రన్ చాలా ముఖ్యమని ట్రేడ్ అనలిస్టులు కూడా అంటున్నారు. 

Read more: Dil Raju: ‘వారసుడు’ సినిమా ఆ ఇద్దరు స్టార్లతో కుదరలేదు.. విజయ్ ఎంట్రీపై దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!