ఫిల్మ్‌ఫేర్‌ (Filmfare Awards)లో ‘పుష్ప’ (Pushpa) హవా.. సాయి పల్లవి (Sai Pallavi) అరుదైన రికార్డు

Updated on Oct 10, 2022 03:14 PM IST
ఫిల్మ్‌ఫేర్ అవార్డు (Filmfare Awards)ల్లో ‘పుష్ప’ (Pushpa) సత్తా చాటింది. ఈ మూవీ ఏకంగా ఏడు అవార్డులు కొల్లగొట్టడం విశేషం.
ఫిల్మ్‌ఫేర్ అవార్డు (Filmfare Awards)ల్లో ‘పుష్ప’ (Pushpa) సత్తా చాటింది. ఈ మూవీ ఏకంగా ఏడు అవార్డులు కొల్లగొట్టడం విశేషం.

దక్షిణాది చలనచిత్ర రంగంలో విశేషంగా భావించే ‘ఫిల్మ్‌ఫేర్’ (Filmfare Awards) అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బెంగళూరులో ఆదివారం రాత్రి జరిగింది. కరోనా పరిస్థితుల కారణంగా గత రెండేళ్లుగా ఈ వేడుకను నిరాడంబరంగా జరపగా.. ఈ ఏడాది మాత్రం ఘనంగా నిర్వహించారు. 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల  ఫంక్షన్‌కు సౌత్ ఇండియన్ సినీ ప్రముఖులు విచ్చేశారు. ఈవెంట్‌లో 2020, 2021 సంవ‌త్స‌రాల‌కుగాను ఎంపికైన చిత్రాల‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల‌ను ప్ర‌దానం చేశారు.

ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్‌తోపాటు కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఈసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం దుమ్మురేపింది. ఏకంగా ఏడు విభాగాల్లో ఆ చిత్రం పురస్కారాలను ఎగరేసుకుపోయింది. తమిళంలో సూర్య హీరోగా యాక్ట్ చేసిన ‘సూరరైపొట్రు’ కూడా ఏడు అవార్డులను దక్కించుకోవడం విశేషం. 

 బన్నీ (Allu Arjun) నటించిన ‘పుష్ప’ సినిమా ఈసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో సత్తా చాటింది. ఉత్తమ చిత్రంగా ‘పుష్ప’ నిలిచింది. అలాగే ఈ మూవీకి డైరెక్షన్ చేసిన వహించిన సుకుమార్ ఉత్తమ దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ కథానాయకుడిగా అల్లు అర్జున్, ​ఉత్తమ సహాయనటుడిగా మురళీశర్మ, ఉత్తమ సహాయనటిగా టబు అవార్డులను దక్కించుకున్నారు. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలోనూ ‘పుష్ప’ మూవీ పురస్కారానికి ఎంపికైంది. 

‘పుష్ప–ది రైజ్’ సంగీత విభాగంలోనూ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమాలో తనదైన ట్యూన్స్‌తో దేశం మొత్తాన్ని ఉర్రూతలూగించిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ను ఫిల్మ్‌ఫేర్ అవార్డు వరించింది. ఇక ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లి’ అంటూ మెలోడి సాంగ్‌తో మ్యాజిక్ చేసిన సిద్ శ్రీరామ్ ఫిలింఫేర్ ఉత్తమ గాయకుడిగా నిలిచారు. అలాగే ‘ఊ అంటావా మావ’ అంటూ తన గాత్రంతో యూత్‌ను ఒక ఊపు ఊపిన సింగర్ ​ఇంద్రావతి చౌహాన్‌ ఉత్తమ గాయని అవార్డులు గెలుచుకున్నారు. 

సాయి పల్లవికి రెండు అవార్డులు

ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఈసారి నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)కి మర్చిపోలేనిదిగానే చెప్పాలి. ఆమెకు ఈ ఏడాది రెండు పురస్కారాలు దక్కాయి. ‘శ్యామ్ సింగా రాయ్’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా క్రిటిక్స్ చాయిస్ అవార్డును అందుకున్న సాయి పల్లవి.. ‘లవ్ స్టోరి’ మూవీలో కనబరిచిన అద్భుతమైన యాక్టింగ్‌కు గానూ ఉత్తమ నటిగా మరో అవార్డునూ కొట్టేశారు. ఈ రకంగా ఒకేసారి రెండు అవార్డులను తన ఖాతాలో వేసుకుని అరుదైన రికార్డును క్రియేట్ చేశారు.

కాగా, ‘శ్యామ్ సింగరాయ్’ మూవీకి గానూ నేచురల్ స్టార్ నాని (Nani) ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ చాయిస్ పురస్కారాన్ని అందుకున్నారు. ‘ఉప్పెన’ చిత్రంతో పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలనూ అవార్డులు వరించాయి. ఆ మూవీలో నటనకు గానూ వైష్ణవ్‌కు ఉత్తమ నూతన నటుడు, కృతికి ఉత్తమ నూతన నటి అవార్డులు దక్కాయి.  

Read more at: అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప’ (Pushpa)పై డైరెక్టర్ తేజ కామెంట్లు..థియేటర్ ఓనర్లకు డబ్బులు రాలేదని వ్యాఖ్య

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!