ఆస్కార్ పరిశీలనలో నేచురల్ స్టార్ నాని (Nani) ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా!

Updated on Aug 17, 2022 08:40 PM IST
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకునే అవకాశం
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకునే అవకాశం

నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన పీరియాడికల్ ఫిక్షనల్ సినిమా 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నానీ కెరీర్‌‌లోనే మంచి హిట్‌గా నిలిచింది. పూర్వజన్మ కథల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని బెంగాలీ యువకుడిగా, ఒక ఫిల్మ్ మేకర్‌‌గా అద్భుతంగా నటించారు. హీరోయిన్ సాయిపల్లవి అత్యుత్తమంగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం బెంగాల్‌లోని ఒక ప్రాంతంలో జరిగే అనాచారాలపై తిరుగుబాటు చేసే యువకుడిగా నాని పవర్ ఫుల్ పాత్రలో నటించారు. కృతిశెట్టి మరో హీరోయిన్‌గా నటించారు.

రాహుల్ రవీంద్రన్, మడోనా సెబాస్టియన్, మురళీ శర్మ, జిషు సేన్ గుప్తా, శుభలేఖ సుధాకర్ కీలకపాత్రల్లో నటించారు. కొన్ని రోజుల తర్వాత ఓటీటీలో విడుదలైన శ్యామ్ సింగరాయ్‌ సినిమా మంచి వ్యూస్‌ సొంతం చేసుకుంది.

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకునే అవకాశం

మూడు కేటగిరీల్లో..

శ్యామ్ సింగరాయ్ సినిమా మూడు కేటగిరీల్లో ఆస్కార్ బరిలో నిలిచింది.'శ్యామ్ సింగరాయ్' చిత్రాన్ని పీరియాడిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, భారతీయ సాంప్రదాయ క్లాసిక్ విభాగాల జాబితాలో ఆస్కార్ పరిశీలనకు పంపినట్టు సమాచారం. ఈ విషయం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌‌పై నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలై మంచి కలెక్షన్లు వసూలు చేసింది. నాని (Nani) హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలవడం గొప్ప విషయం.

Read More : కామన్ మ్యాన్ నుంచి నేచురల్ స్టార్ వరకు 'ఓ సుదీర్ఘ ప్రయాణం'.. నాని (Nani) నటించిన టాప్‌ టెన్ సినిమాలు ఇవే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!