Sai Pallavi: రణ్‌బీర్ కపూర్‌తో జోడీ కట్టనున్న సాయి పల్లవి?.. సీత పాత్రతో నేచురల్ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ..!

Updated on Dec 07, 2022 06:26 PM IST
రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న మూవీలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి (Sai Pallavi) నటించనున్నారని గాసిప్స్ వస్తున్నాయి
రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న మూవీలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి (Sai Pallavi) నటించనున్నారని గాసిప్స్ వస్తున్నాయి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi)కి యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆమె చేరువయ్యారు. ‘ఫిదా’,‘లవ్ స్టోరీ’ లాంటి చిత్రాల్లో ఆమె యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలతో ఆమె నేచురల్ యాక్టర్ అనే పేరు తెచ్చుకున్నారు. ఎడాపెడా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేయడం సాయి పల్లవికి నచ్చదు. అందుకే ఆమె నుంచి రెగ్యులర్‌గా చిత్రాలు రావు. 

మంచి కథ, కథనంతోపాటు తన పాత్రకు ఉండే ప్రాముఖ్యతను బట్టే సాయి పల్లవి సినిమాలను ఓకే చేస్తారని ఆమె గత చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. ‘గార్గి’, ‘విరాటపర్వం’ లాంటి విలక్షణమైన సినిమాల్లోనూ నటిస్తారు కాబట్టే సాయి పల్లవికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటనతోపాటు అందం, డ్యాన్సులతో ఆమె అందర్నీ తనవైపునకు తిప్పుకుంటున్నారు. అలాంటి ఈ అందాల భామ త్వరలోనే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తారని వినికిడి. 

 సాయి పల్లవి (Sai Pallavi)కి యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

బీ టౌన్ బిగ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)తో రొమాన్స్ చేసే అవకాశాన్ని సాయి పల్లవి దక్కించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. హిందీ నిర్మాత మధుమంతెన రామాయణాన్ని సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపిస్తారని గాసిప్స్ వస్తున్నాయి. ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి నటించనున్నారంటూ బీ టౌన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని విజువల్ వండర్‌గా తెరకెక్కించనున్నారట. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని సమాచారం. ఈ సినిమా 2023 సెప్టెంబర్‌లో పట్టాలెక్కనుందని వినికిడి. సీత పాత్ర కోసం మేకర్స్ గతంలో దీపికా పదుకొణె, కరీనా కపూర్‌లను సంప్రదించారని రూమర్స్ హల్‌చల్ చేశాయి. ఇప్పుడు ఆ రోల్ కోసం సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందనేది ఇంకా తెలియరాలేదు. మూవీ మేకర్స్ లేదా సాయి పల్లవి దీనిపై స్పందిస్తే గానీ ఓ క్లారిటీ రాదు. 

Read more: ‘డేంజరస్’ (Dangerous Promotions) సినిమా ప్రమోషన్లలో అషు రెడ్డి (Ashu Reddy) కాళ్లను పట్టుకున్న ఆర్జీవీ (RGV)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!