అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న ‘పుష్ప2’ (Pushpa2)లో సాయిపల్లవి నటించడంపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Updated on Sep 10, 2022 10:13 PM IST
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కనున్న పుష్ప2 సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కనున్న పుష్ప2 సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప2 (Pushpa2). సూపర్‌‌హిట్ అయిన పుష్ప సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప2 సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా సినిమాగా ఈ సినిమా రూపొందుతోంది.

పోయిన ఏడాది డిసెంబర్‌‌లో రిలీజై హిట్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది పుష్ప సినిమా. పుష్ప సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మికా మందాన పుష్ప2 సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే రష్మికతోపాటు ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్‌ కూడా నటించనున్నారనే వార్తలు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కనున్న పుష్ప2 సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది

మరో హీరోయిన్‌ ఎవరూ లేరు..

పుష్ప2 సినిమాలో సాయి పల్లవి కూడా నటించనున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్‌పై మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ఈ రూమర్స్‌లో నిజం లేదని తేల్చి చెప్పింది. పుష్ప2లో సాయి పల్లవి కూడా నటిస్తున్నారనే వార్తల్లో నిజం లేదు. రష్మికా మందాన తప్ప మరో హీరోయిన్ ఈ సినిమాలో నటించడం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.  

కాగా, పుష్ప సినిమాలో సునీల్, అనసూయ, అజయ్ ఘోష్‌, ఫహద్ ఫాజిల్ రెండో భాగంలో కూడా నటించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ దాదాపుగా రూ.350 కోట్లు వసూలు చేసింది. మరి పుష్ప2 (Pushpa2) సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి మరి.

Read More : పుష్ప2 సినిమా బడ్జెట్‌లో సగం అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ రెమ్యునరేషన్లకే.. మరీ అంత తీసుకుంటున్నారా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!