సాయి ధ‌ర‌మ్ తేజ్ (Saidharam Tej) సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్.. ‘విరూపాక్ష‌’ (Virupaksha) టైటిల్ గ్లింప్స్ రిలీజ్!

Updated on Dec 07, 2022 12:50 PM IST
అందరూ అనుకున్నట్లుగానే ఈ చిత్రానికి ‘విరూపాక్ష‌’ (Virupaksha) అనే టైటిల్ ను క‌న్ఫార్మ్ చేశారు మేకర్స్. 
అందరూ అనుకున్నట్లుగానే ఈ చిత్రానికి ‘విరూపాక్ష‌’ (Virupaksha) అనే టైటిల్ ను క‌న్ఫార్మ్ చేశారు మేకర్స్. 

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ (Saidharam Tej) క‌థానాయ‌కుడిగా కార్తీక్ దండు ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాది పాటు ఇంటికే పరితమైన సాయిధరమ్ తేజ్.. ప్రస్తుతం తన 15వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

ఈ చిత్రంలో ‘భీమ్లా నాయక్’ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా న‌టిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను మేక‌ర్స్ బ‌య‌ట‌కు వ‌దిలారు. టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వాయిస్ అందించిన ఈ గ్లింప్స్ అదిరిపోయింద‌ని చెప్పాలి. ఇక అందరూ అనుకున్నట్లుగానే ఈ చిత్రానికి ‘విరూపాక్ష‌’ (Virupaksha) అనే టైటిల్ ను క‌న్ఫార్మ్ చేశారు మేకర్స్. 

టైటిల్ గ్లింప్స్ లో ఎన్టీఆర్ (NTR Voice Over) వాయిస్ తో ‘‘అజ్ఞానం భ‌యానికి మూలం భ‌యం మూఢ‌న‌మ్మ‌కానికి కార‌ణం.. ఆ న‌మ్మ‌క‌మే నిజ‌మైనప్పుడు ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్క‌న‌ప్పుడు అస‌లు నిజాన్ని చూపించే మ‌రో నేత్రం..” అనేగానే… ‘విరూపాక్ష’ అనే టైటిల్ రివీల్ అయ్యింది. చేత‌బ‌డి లాంటి మూఢ‌న‌మ్మకాల చుట్టూ ఓ గ్రామం నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేయనున్నారు.

అసలు నిజాన్ని చూపించే మరో నేత్రమే 'విరూపాక్ష' (Virupaksha).. అంటూ టైటిల్ విషయంలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. టైటిల్ ను డిజైన్ చేయించిన తీరు కూడా ఆకట్టుకుంటోంది. సుకుమార్ స్క్రీన్ ప్లేను అందించారు. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదల కానుంది. మ‌రి ఈ సినిమా తేజూకి ఎంత వ‌ర‌కు ప్ల‌స్ అవుతుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

Read More: మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ (Saidharam Tej) బర్త్‌డే స్పెషల్.. 'SD15' నుంచి ఆసక్తికర పోస్టర్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!