అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప’ (Pushpa)పై డైరెక్టర్ తేజ కామెంట్లు..థియేటర్ ఓనర్లకు డబ్బులు రాలేదని వ్యాఖ్య
అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa) సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలై సక్సెస్ సాధించింది. ఈ సినిమాతో బన్నీ క్రేజ్ విపరీతంగా పెరిగింది. హీరోయిన్ రష్మికా మందానకు కూడా నేషనల్ క్రష్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది పుష్ప సినిమా. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే పుష్ప సినిమపై డైరెక్టర్ తేజ పలు కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల మీడియాతో మాట్లాడారు డైరెక్టర్ తేజ. చాలామంది అనుకుంటున్నట్టుగా పుష్ప సినిమా తెలుగులో హిట్ కాదని అన్నారు తేజ. పుష్ప సినిమా విడుదల చేసిన థియేటర్ ఓనర్లలో చాలామందికి డబ్బులు రాలేదని చెప్పారు. ఇతర భాషల్లో పుష్ప సినిమా బాగా ఆడిందని, తెలుగులో అంత బాగా ఆడలేదని అన్నారు తేజ. పుష్ప సినిమా నష్టాలు తెచ్చిందని, అలాగే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా.. కొన్ని చోట్ల లాభాలు తెచ్చిపెట్టిందని అన్నారు తేజ.
బిజినెస్‌పై అవగాహన..
డైరెక్టర్ తేజకి థియేటర్ల బిజినెస్ ఉంది. దాంతో సినిమా బిజినెస్ వ్యవహారాలపై ఆయనకు అవగాహన ఉంది. దీంతో తేజ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. 'పుష్ప' సినిమాకు సీక్వెల్‌గా పుష్ప2 సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.
ఇక తేజ విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో దర్శకుడిగా ఆయనకు సరైన సినిమా రాలేదు. ప్రస్తుతం దగ్గుబాటి సురేష్‌బాబు రెండో కొడుకు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. పుష్ప (Pushpa) సినిమా గురించి తేజ చేసిన కామెంట్లపై అల్లు అర్జున్ (Allu Arjun), ఆయన అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.