అల్లు అర్జున్‌ (Allu Arjun) పుష్ప2 (Pushpa2)లో మరో బాలీవుడ్ హీరో! ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ సుకుమార్

Updated on Oct 06, 2022 04:52 PM IST
అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప2  షూటింగ్‌ పూజా కార్యక్రమాలు ముగిశాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప2 షూటింగ్‌ పూజా కార్యక్రమాలు ముగిశాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

పుష్ప2 (Pushpa2)  సినిమాపై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. దర్శకుడు సుకుమార్ ప్లానింగ్ ఎలా ఉందో తెలియకున్నా.. అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు మాత్రం పుష్ప2పై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమా గురించి ప్రతి రోజూ ఏదో ఒక అప్‌డేట్‌ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పుష్ప2 సినిమాలోని ఒక పవర్‌‌ఫుల్ క్యారెక్టర్‌‌లో బాలీవుడ్ యంగ్ హీరో నటిస్తున్నారని సమాచారం.

ఐకాన్ స్టార్  అల్లు అర్జున్  హీరోగా డైరెక్టర్ సుకుమార్  దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఈ పాన్ ఇండియా సినిమా పోయినేడాది డిసెంబర్ 17వ తేదీన విడుదలై మంచి కలెక్షన్స్‌ వసూలు చేసింది. పుష్ప సినిమా తెలంగాణలో ఆల్‌టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది. పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా దక్కాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అని పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మేకోవర్ చూసి సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఆయనను మెచ్చుకున్నారు. ఇక పుష్ప సినిమాలోని పాటలు అన్ని భాషల్లో కలిపి 5 బిలియన్ వ్యూస్ సాధించాయి.

మొత్తంగా ఎక్కువ మంది యూట్యూబ్‌లో చూసిన పాటల ఆల్బమ్‌గా పుష్ప పాటలు రికార్డులు సృష్టించాయి. ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప2 తెరకెక్కనుంది. ఇటీవల పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప2  షూటింగ్‌ పూజా కార్యక్రమాలు ముగిశాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

పాన్ ఇండియా క్రేజ్‌..

పుష్ప సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మికా మందాన కూడా నేషనల్ క్రష్‌గా ఫేమస్ అయ్యారు. ఈ సినిమా హిట్‌ తర్వాత బాలీవుడ్‌లో కూడా అవకాశాలు వస్తున్నాయి రష్మికకు. పుష్ప2 సినిమాలో సీనియర్‌‌ హీరోయిన్ ప్రియమణి నటించనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే దానిపై అధికారిక సమాచారం రాలేదు. పుష్ప2 సినిమాలోని మరో కీలకపాత్ర కోసం బాలీవుడ్‌ హీరోను చిత్ర యూనిట్‌ సంప్రదించారని టాక్.

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌‌ కొడుకు అర్జున్ కపూర్‌‌ను పుష్ప సినిమాలోని ఒక పోలీస్ క్యారెక్టర్ కోసం సంప్రదించారని తెలుస్తోంది. దానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా పుష్ప సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న పుష్ప2 (Pushpa2) సినిమాలో అర్జున్ కపూర్ నటించనున్నారనే వార్త వైరల్ అవుతోంది.  

Read More : నా అభిమాన నటుడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ఇన్‌స్టా చిట్‌చాట్‌లో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!