ఐదుగురు స్టార్స్‌తో ‘హిట్ 7’ తీస్తా.. కథ బాగుంటే ఏదైనా సాధ్యమే: డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu)

Updated on Dec 10, 2022 11:44 AM IST
థ్రిల్లర్ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని.. ఆ ఇష్టమే ‘హిట్’, ‘హిట్ 2’ లాంటి చిత్రాలు తీయడానికి కారణమై ఉండొచ్చని శైలేష్ కొలను అన్నారు
థ్రిల్లర్ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని.. ఆ ఇష్టమే ‘హిట్’, ‘హిట్ 2’ లాంటి చిత్రాలు తీయడానికి కారణమై ఉండొచ్చని శైలేష్ కొలను అన్నారు

ఈ ఏడాది టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చింది. ‘డీజే టిల్లు’, ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’, ‘మేజర్’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ లాంటి సూపర్‌డూపర్ హిట్లతో తెలుగు పరిశ్రమ దూసుకెళ్తోంది. తాజాగా ‘హిట్ 2’ (Hit 2) రూపంలో మరో మంచి విజయం దక్కింది. టాలీవుడ్ నయా స్టార్ అడివి శేష్ హీరోగా నటించిన ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజైన మూడ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. 

సూపర్ హిట్ దిశగా తమ మూవీ దూసుకెళ్తున్నప్పటికీ ‘హిట్ 2’ చిత్ర బృందం మాత్రం ఇంకా ప్రమోషన్స్ ఆపడం లేదు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో డైరెక్టర్ శైలేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘హిట్’ ఫ్రాంచైజీలో చేస్తూ వచ్చిన ఐదుగురు స్టార్స్‌తో 7వ భాగం చేస్తానని చెప్పారు. ఆ పార్ట్ సూపర్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందన్నారు. 

తాజాగా ‘హిట్ 2’ (Hit 2) రూపంలో మరో మంచి విజయం దక్కింది

ఐదురుగు స్టార్స్‌తో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నకు శైలేష్ కొలను స్పందిస్తూ.. ‘ఐదుగురు స్టార్స్‌ను ఒక చోటకు చేర్చి సినిమా చేయడమనేది చాలా కష్టమైన పనే. కాకపోతే ఆ కష్టాన్ని ఇష్టంగా పడదామని నిర్ణయించుకున్నా. కథలో విషయం ఉంటే అదే స్టార్స్‌ను ఒప్పిస్తుందనేది నా నమ్మకం’ అని శైలేష్ చెప్పుకొచ్చారు. తనకు థ్రిల్లర్ సినిమాలు తీయడమంటే చాలా ఇష్టమని ఆయన అన్నారు. 

‘మొదటి నుంచి కూడా నాకు థ్రిల్లర్ సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. ఆ చిత్రాలనే ఎక్కువగా చూస్తూ ఉండేవాడ్ని. ఇక పోలీసు డిపార్టుమెంటు అంటే కూడా నాకు చాలా ఇష్టం. అందువల్లే నేను ఈ జోనర్‌ను ఎంచుకున్నానేమో అని అనిపిస్తోంది. ఈ తరహా మూవీల్లో లైన్ సింపుల్‌గానే అనిపించినా.. ఎమోషన్స్, డ్రామాను సమతూకం చేస్తూ సమర్థవంతంగా నడిపించాలి. అందులో నేను విజయవంతం అయ్యాననే అనుకుంటున్నా’ అని శైలేష్ పేర్కొన్నారు. 

Read more: సరికొత్త పాత్రలో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya).. ధూత (Dhootha) వెబ్ సిరీస్ కోసం అలాంటి పాత్రలో చైతూ!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!