ప్రేక్ష‌కుల‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన‌ సాయిప‌ల్ల‌వి (Sai Pallavi).. సెల్పీ కోసం క్యూ క‌ట్టిన‌ అభిమానులు

Updated on Jul 20, 2022 04:26 PM IST
గార్గి చిత్రం రిలీజ్ అయిన త‌ర్వాత సాయి ప‌ల్ల‌వి(Sai Pallavi) థియేట‌ర్ల‌కు వెళ్లి మ‌రీ అభిమానుల‌ను క‌లుస్తున్నారు. 
గార్గి చిత్రం రిలీజ్ అయిన త‌ర్వాత సాయి ప‌ల్ల‌వి(Sai Pallavi) థియేట‌ర్ల‌కు వెళ్లి మ‌రీ అభిమానుల‌ను క‌లుస్తున్నారు. 

టాలీవుడ్‌లో సాయిప‌ల్ల‌వి (Sai Pallavi) త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. సౌత్‌లోనే సాయిప‌ల్ల‌వి టాప్ హీరోయిన్లల‌లో ఒక‌రిగా కొన‌సాగుతున్నారు. విభిన్న‌మైన సినిమాల‌లో బ‌ల‌మైన పాత్ర‌ల్లో సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్నారు. లేడి ఓరియెంటెడ్ సినిమాల్లోనూ త‌న న‌ట విశ్వ రూపం చూపిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'గార్గి' చిత్రం సాయి ప‌ల్ల‌వికి మంచి గుర్తింపునిచ్చింది.

'గార్గి'గా అద‌ర‌గొట్టిన సాయిప‌ల్ల‌వి
సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సినిమా 'గార్గి'. ఈ సినిమాను ఎమోషనల్ డ్రామాగా తెర‌కెక్కించారు. తన తండ్రికి న్యాయం చేయడం కోసం ఎదురించే కూతురు పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి న‌టించారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో 'గార్గి' జూలై 15న రిలీజ్ అయింది. రవిచంద్రన్ రామచంద్రన్, థామస్ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. 'గార్గి' సినిమా చూసిన ప్రేక్ష‌కులు సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌ను మెచ్చుకుంటున్నారు. 

అభిమానుల‌తో సాయిప‌ల్ల‌వి
'గార్గి' చిత్రం రిలీజ్ అయిన త‌ర్వాత సాయి ప‌ల్ల‌వి థియేట‌ర్ల‌కు వెళ్లి మ‌రీ అభిమానుల‌ను క‌లుస్తున్నారు. 
ఈ సినిమా రెస్పాన్స్‌ను స్వయంగా చూసేందుకు సాయిపల్లవి థియేటర్ల‌కు వెళుతున్నారు. చెన్నై, హైదరాబాద్‌లోని పలు థియేటర్లకు వెళ్లిన సాయిప‌ల్ల‌వి ఫ్యాన్స్‌తో కలిసి సినిమాను చూస్తున్నారు. అంతేకాకుండా ప్రేక్ష‌కులు, అభిమానుల‌తో కాసేపు సరదాగా మాట్లాడుతున్నారు.

సాయిప‌ల్ల‌విని చూసిన‌ అభిమానులు స‌ర్‌ప్రైజ్‌గా ఫీల్ అవుతున్నారు. త‌మ‌కు ఇష్ట‌మైన హీరోయిన్ ఎదురుగా ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంతో ఫోటోలు దిగేందుకు పోటీ ప‌డుతున్నారు. సాయిప‌ల్ల‌వి థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్న వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

 Read More:  Gargi: గార్గి ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన రానా ద‌గ్గుబాటి .. న్యాయం కోసం పోరాడే పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!