ఐఎం‌డీబీ (IMDB) మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ టాప్ 10 జాబితాలో ముగ్గురు తెలుగు హీరోలు!

Updated on Dec 07, 2022 08:54 PM IST
ధనుష్ (IMDB) బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలతో ఐఎండీబీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. 
ధనుష్ (IMDB) బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలతో ఐఎండీబీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. 

2022 సంవత్సరానికిగానూ అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల జాబితాను ఇంటర్‌నెట్‌ మూవీ డాటాబేస్‌(IMDB) సంస్థ రిలీజ్ చేసింది. తమ నటనతో ప్రేక్షకులకు వినోదం పంచుతున్న టాప్ 10 జాబితాను ప్రకటించింది. తమిళ నటుడు ధనుష్ బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలతో ఐఎండీబీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. 

టాలీవుడ్ (Tollywood) హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ టాప్ 10  ఐఎండీబీ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది పలు సినిమాలలో నటించిన సమంత కూడా అత్యంత జనాదరణ పొందిన తారగా నిలిచారు.

ధనుష్ (IMDB) బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలతో ఐఎండీబీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. 

1. ధనుష్

2022 సంవత్సరం నటుడు ధనుష్‌కు బ్లాక్ బాస్టర్ ఇయర్‌గా నిలిచింది. ఈ ఏడాది ధనుష్ నటించిన 'ది గ్రే మ్యాన్', 'మారన్', 'తిరుచిత్రంబలం', 'నానే వరువన్', 'వాతి' విడుదలయ్యాయి. భారతీయ స్టార్లతో పోటీ పడి ధనుష్ అత్యంత జనాదారణ కలిగిన స్టార్‌గా ఐఎండీబీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.

2. అలియా భట్

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన అలియా భట్ రెండో స్థానంలో నిలిచారు. ఈ సంవత్సరం అలియా నటించిన టాలీవుడ్ సినిమా 'ఆర్ఆర్ఆర్' ప్రపంచ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది.

'డార్లింగ్స్', 'బ్రహ్మాస్త్ర' సినిమాలలో నటించిన అలియా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అలియా భట్ ఇదే ఏడాది పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా ఓ బిడ్డకు తల్లి అయ్యారు. అలియాభట్ ఐఎండీబీ జాబితాలో రెండోస్థానంలో నిలిచింది.

3. ఐశ్వర్య రాయ్ బచ్చన్

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించిన 'పొన్నియిన్ సెల్వన్1' భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రాణి నందిని దేవీగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ మొదటి సారి నెగెటీవ్ షేడ్ పాత్రలో నటించి.. అందిరినీ ఆకట్టుకున్నారు. ఐఎండీబీ జాబితాలో ఐశ్వర్య మూడో స్థానంలో నిలిచి ఆశ్చర్య పరిచారు. 

4. రామ్ చరణ్ తేజ

రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా తరువాత రామ్ చరణ్‌కు ప్రపంచ వ్యాప్తంగా అబిమానులు పెరిగారు. అంతేకాదు ఐఎండీబీ జాబితాలో చరణ్ నాల్గో స్థానంలో నిలిచారు.

5. సమంత రూత్ ప్రభు

అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్‌లో నటించారు. ''ఉ అంటవా మావ.. ఊ ఊ అంటావా'' అనే పాటలో ఓ రేంజ్‌లో సమంత అదరగొట్టారు. ఈ పాటతో సమంత మరింత పాపులర్ అయ్యారు. సమంత నటించిన తమిళ చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్‌' బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఇటీవల రిలీజ్ అయిన 'యశోద' సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఈ ఏడాదిలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటిగా సమంత ఐఎండీబీ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచారు. 

6. హృతిక్ రోషన్

'విక్రమ్ వేద' చిత్రం హృతిక్ రోషన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.  ఐఎండీబీ జాబితాలో హృతిక్ ఆరవ స్థానంలో చోటు సంపాదించుకున్నారు. 

7. కియారా అద్వానీ

కియారా అద్వానీ నటించిన భూల్‌ భులయా 2, జగ్‌ జగ్‌ జీయో సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. కియారా నటనకు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం కియారా హిందీలో గోవింద్ మేరా నామ్, తెలుగులోరామ్ చరణ్ సరసన ఆర్‌సీ 15 లో నటిస్తున్నారు.   ఐఎండీబీ జాబితాలో కియారా ఏడవ స్థానంలో నిలిచారు.

8. జూనియర్ ఎన్టీఆర్

'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమురం భీముడిగా ఎన్టీఆర్ అద్భుతమైన నటనను కనబరిచారు. గిరిజన జాతికి చెందిన యువకుడి పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రపంచ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు లభించాయి. ఐఎండీబీ జాబితాలో ఎన్టీఆర్ ఎనిమిదవ  స్థానంలో చోటు సంపాదించుకున్నారు. 

9. అల్లు అర్జున్

'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్‌లో పేరు సంపాదించుకున్నారు. తగ్గేదేలే అంటూ ప్రేక్షకులకు వినోదం అందించారు. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఐఎండీబీ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచారు. 

10. యశ్

కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' సినిమాతో పలు రికార్డులను బద్దలు కొట్టింది. వేయి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో నటించిన యశ్‌కు ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. యశ్ ఐఎండీబీ జాబితాలో పదో స్థానంలో చోటు దక్కించుకున్నారు. 

Read More: Mahanati Savitri Birth Anniversary: "నటనను ఆరాధించిన మహానటి" - సావిత్రి జయంతి సందర్భంగా పింక్ విల్లా ప్రత్యేక కథనం.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!