ఒకే ఫ్రేములో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. అభిమానులకు పండగే!
Mahesh Babu-Allu Arjun: సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే వేదిక మీద దర్శనమివ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఒకవేళ.. ఇద్దరు స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే మాత్రం అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటి సంఘటనే తాజాగా జరిగింది. తాజాగా టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబులు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి.. తమ అభిమానులకు కనువిందు చేశారు.
అసలు విషయంలోకి వెళితే.. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గుణశేఖర్ (Director Gunashekar) కుమార్తె నీలిమా వివాహం ఇటీవల వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో జరిగింది. కాగా, ఆదివారం నాడు రిసెప్షన్ (Reception) ఏర్పాటు చేశారు. ఈ వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీని రాజకీయ ప్రముఖులు హాజరై నవ దంపతులను ఆశీర్వాదించారు. ఈ వేడుకకు టాలీవుడ్ అగ్ర తారలు తరలిరావడంతో భారీ సందడి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఈ వేడుకకు మహేష్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun) కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే వేదికపై ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తూ ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఓవైపు బన్నీ.. మరోవైపు సూపర్ స్టార్ ఉండడం చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరి ఫోటోను చూసిన నెటిజనులు.. వాటే కాంబినేషన్.. ఫోటో ఆఫ్ ది ఇయర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నీలిమా వివాహ రిసెప్షన్ కు రాజమౌళి-రమ, కె.రాఘవేంద్రరావు, రాజశేఖర్, జీవిత దంపతులు, సంగీత దర్శకుడు మణిశర్మ, సీనియర్ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు రిసెప్షన్ కు విచ్చేసి నూతన వధూవరులు నీలిమ (Guna Neelima), రవిలను ఆశీర్వదించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
కాగా మహేష్ బాబు (Mahesh Babu) గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో ‘ఒక్కడు’, ‘సైనికుడు’ వంటి సినిమాల్లో నటించాడు. అల్లు అర్జున్ (Allu Arjun) ‘వరుడు’ సినిమాని గుణశేఖర్ తెరకెక్కించగా.. ప్రస్తుతం ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న మైథలాజికల్ మూవీ ‘శాకుంతలం’ సినిమాతో అల్లు అర్జున్ కూతురు ‘అర్హ’ వెండితెర అరంగేట్రం చేస్తోంది.
Read More: సమంత (Samantha) నటించిన 'శాకుంతలం' (Shakuntalam) త్రీడీ థియేటర్లలో విడుదల.. అధికారిక ప్రకటన!