సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) తాజా ప్రాజెక్ట్‌ 'SDT 15'.. టైటిల్ గ్లింప్స్ కి ఎన్టీఆర్ (NTR) వాయిస్ ఓవర్!

Updated on Dec 06, 2022 11:58 AM IST
‘SDT 15’ సినిమా టైటిల్ గ్లింప్స్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR) వాయిస్ ఓవర్ ఇస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
‘SDT 15’ సినిమా టైటిల్ గ్లింప్స్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR) వాయిస్ ఓవర్ ఇస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

టాలీవుడ్‌ యంగ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్‌ SDT 15 (వర్కింగ్ టైటిల్). తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ నటించిన ఈ సినిమా నుంచి డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమా గ్లింప్స్, టైటిల్ విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

‘SDT 15’ చిత్రంలో హీరోగా సాయిధ‌ర‌మ్ తేజ్ సరసన మలయాళ భామ సంయుక్తా మీన‌న్ (Samyuktha Menon) హీరోయిన్ గా న‌టిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. SDT15లో బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాంతార ఫేం మ్యూజిక్ డైరెక్టర్ అంజ‌నీశ్ లోక్‌నాథ్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు‌. ‘కిరాక్ పార్టీ’ త‌ర్వాత అంజ‌నీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న రెండో తెలుగు సినిమా ఇది.

‘SDT 15’ సినిమా టైటిల్ గ్లింప్స్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR) వాయిస్ ఓవర్ ఇస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఒక గాంభీర్యమైన తారక్ వాయిస్ తో ఈ టైటిల్ ఫస్ట్ లుక్ ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఇదే రీతిగా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ ఫస్ట్ సినిమా “ఉప్పెన” ట్రైలర్ తారక్ రిలీజ్ చేశాడు.

ఇకపోతే సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తన కొత్త సినిమా టైటిల్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ఖరారు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ‘విరూపాక్ష’ అంటే శివుడి రూపం అనే అర్థం వస్తుంది. మరి ఇందులో సాయి ధరంతేజ్ పాత్ర కూడా అదే తరహాలో ఉండబోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సాయిధరమ్ తేజ్ సినిమా టైటిల్ అదిరిపోయిందని అభిమానులు భావిస్తున్నారు.

Read More: మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ (Saidharam Tej) బర్త్‌డే స్పెషల్.. 'SD15' నుంచి ఆసక్తికర పోస్టర్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!