'బోన‌మెత్తిన సాయిప‌ల్ల‌వి' (Sai Pallavi)!.. బోనాల పండుగ‌పై ద‌ర్శ‌కుడు వేణు ట్వీట్

Updated on Jul 24, 2022 04:48 PM IST
విరాటప‌ర్వం సినిమాలో బోనం ఎత్తిన హీరోయిన్ సాయిప‌ల్ల‌వి  (Sai Pallavi) ఫోటోను షేర్ చేసిన ద‌ర్శ‌కుడు వేణు.
విరాటప‌ర్వం సినిమాలో బోనం ఎత్తిన హీరోయిన్ సాయిప‌ల్ల‌వి  (Sai Pallavi) ఫోటోను షేర్ చేసిన ద‌ర్శ‌కుడు వేణు.

తెలంగాణ‌లో బోనాల పండుగ చాలా ప్రత్యేక‌మైంది. హీరోయిన్ సాయిప‌ల్ల‌వి (Sai Pallavi) బోనం ఎత్తిన ఫోటోను ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. విరాట‌ప‌ర్వంలో తెలంగాణ ఆడ‌ప‌డుచుగా సాయిప‌ల్ల‌వి అద్భుతంగా న‌టించారు. ఆ సినిమాలోని బోనం ఎత్తిన ఫోటోల‌ను వేణు ఊడుగుల షేర్ చేశారు. బోనాల గొప్ప‌ద‌నం గురించి ద‌ర్శ‌కుడు వేణు త‌న ట్వీట్ ద్వారా వివ‌రించారు.

బోనాల పండుగ శుభాకాంక్ష‌లు - వేణు

తెలంగాణ‌లో బోనాల పండుగ జ‌రుగుతుంది. ఈ సంద‌ర్భంగా వేణు బోనాల జాత‌ర‌పై ఓ ట్వీట్ చేశారు. 'విరాట‌ప‌ర్వం' సినిమాలోని సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) బోనం ఎత్తిన ఫోటోను షేర్ చేశారు. వేణు ఊడుగుల అంద‌రికీ బోనాల శుభాకాంక్ష‌లు తెలిపారు. 'గ్రామీణ జీవన సంస్కృతికి, ప్రకృతికి, పర్యావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ! ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక!..'అంటూ వేణు ట్వీట్ చేశారు. 

తెలంగాణ ఉద్య‌మ నేప‌ధ్యంలో తెర‌కెక్కిన 'విరాట ప‌ర్వం' సినిమాలో రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి హీరో హీరోయిన్ల‌గా న‌టించారు. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో జూన్ 17న ఈ చిత్రం విడుద‌లైంది. ద‌గ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో సుధాక‌ర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. 'విరాట‌ప‌ర్వం' సినిమాలో ప్రియ‌మ‌ణి న‌క్స‌లైట్ భార‌త‌క్క పాత్ర‌లో న‌టించారు. జరీనా వాహెబ్, నవీన్ చంద్ర, సాయిచంద్, ఈశ్వరీ బాయ్, నందితా దాస్, నివేదా పేతురాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. 

Read More : ప్రేక్ష‌కుల‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన‌ సాయిప‌ల్ల‌వి (Sai Pallavi).. సెల్పీ కోసం క్యూ క‌ట్టిన‌ అభిమానులు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!