RC15: ఒక్క పాటకు అన్ని కోట్ల ఖర్చా?.. రొమాంటిక్ సాంగ్ కోసం శంకర్ (Shankar Shanmugham) భారీ స్కెచ్!

Updated on Oct 27, 2022 04:09 PM IST
‘ఆర్‌సీ15’లో  చరణ్​ (Ram Charan)–కియారా (Kiara Advani)తో ఓ సాంగ్‌ను భారీగా తెరకెక్కించాలని శంకర్ (Shankar Shanmugham) ప్లాన్ చేస్తున్నారట
‘ఆర్‌సీ15’లో చరణ్​ (Ram Charan)–కియారా (Kiara Advani)తో ఓ సాంగ్‌ను భారీగా తెరకెక్కించాలని శంకర్ (Shankar Shanmugham) ప్లాన్ చేస్తున్నారట

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు శంకర్ (Shankar Shanmugham). ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్​ తేజ్ (Ram Charan)తో ఓ సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఆర్‌సీ15’ (RC15) అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో చరణ్​ సరసన కియారా అద్వానీ (Kiara Advani) కథానాయికగా నటిస్తున్నారు. శంకర్‌‌–చరణ్​ కాంబో అనగానే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

శంకర్ దర్శకత్వ ప్రతిభ ఏంటో అందరికీ తెలిసిందే. సమాజాన్ని ప్రశ్నిస్తూ సినిమాలు తీసే శంకర్.. ఆయన చిత్రాల్లోని పాటలు, ఫైట్లలో రిచ్‌నెస్ ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా శంకర్ సినిమాల్లోని పాటలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటాయి. వీటిని తీసేటప్పుడు ఆయన అస్సలు రాజీ పడరని తెలిసిందే. చరణ్‌తో తీస్తున్న మూవీలోనూ సాంగ్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారట ఈ మెగా దర్శకుడు. చరణ్​–కియారా మధ్య ఓ రొమాంటిక్ పాటను భారీగా ప్లాన్ చేశాడట. ఇందుకోసం ఏకంగా రూ.23 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు వినికిడి. 

సాధారణంగా శంకర్ సినిమాల బడ్జెట్ విషయంలో వినిపించే రకరకాల పుకార్లు.. ఈ ‘ఆర్‌సీ15’ విషయంలోనూ వస్తున్నాయి. పాట కోసం కోట్లాది రూపాయలు ఆయన ఖర్చు చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. రామ్ చరణ్​–కియారా అద్వాణీలతో తీయనున్న ఓ సాంగ్‌లో వెయ్యికి పైగా డ్యాన్సర్లు స్టెప్పులు వేయనున్నారట. మరి, దీంట్లో ఎంత నిజముందో తెలీదు. ‘ఆర్‌సీ15’ ఫస్ట్ లుక్ పోస్టర్ మీదా ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఆ పోస్టర్ కోసం దాదాపు రూ.2 కోట్లను శంకర్ ఖర్చు పెట్టారట. అలాగే సినిమాలోని ఓ కీలక సన్నివేశం కోసం రూ.10 కోట్లతో ఒక సెట్ వేసినట్లు గతంలో పుకార్లు వచ్చాయి. వీటిల్లో ఏది నిజమనేది చిత్ర యూనిట్‌కే తెలియాలి. 

Read more: Indian 2: 'ఇండియ‌న్ 2' కోసం క‌మ‌ల్ హాస‌న్‌ (Kamal Haasan)కు రెమ్యునరేషన్ అన్ని కోట్లా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!