పోరాట యోధురాలి పాత్రలో కీర్తి సురేష్‌ (Keerthy Suresh).. హోంబ‌లే ఫిలింస్ నిర్మాణ సంస్థలో ‘రగ్ తాథా’ (Raghu Thatha)

Updated on Dec 05, 2022 11:07 AM IST
కేజీఎఫ్‌ (KGF), కాంతార (Kantara) వంటి చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో దుమ్ము దులిపిన నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ (Hombale Films) ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని నిర్మిస్తోంది.
కేజీఎఫ్‌ (KGF), కాంతార (Kantara) వంటి చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో దుమ్ము దులిపిన నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ (Hombale Films) ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని నిర్మిస్తోంది.

ఓవైపు గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ మెప్పిస్తున్న హీరోయిన్ ‘మహానటి’ కీర్తి సురేష్‌ (Keerthy Suresh). ‘మహానటి’ సినిమా తర్వాత ఇప్పటికు వరకు ఆమెకు ఆ స్థాయి విజయం దక్కలేదు. ఇటీవలే విడుదలైన ‘సర్కారు వారి పాట’ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం యావరేజ్‌ హిట్ తోనే సరిపెట్టుకుంది. అయితే తాజాగా ఓటీటీలో విడుదలైన ‘సాని కాదియం’ కీర్తికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం కీర్తి సురేష్ నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అందులో రెండు తెలుగు సినిమాలు కాగా, మరో రెండు తమిళ సినిమాలు. మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ (Bhola Skankar) చిత్రంలో కీర్తి చెల్లి పాత్ర చేస్తున్నారు. ఇక నానికి జంటగా తెరక్కుతున్న ‘దసరా’ (Dasara) చిత్రంపై భారీ హైప్ నెలకొని ఉంది. పాన్ ఇండియా చిత్రంగా ‘దసరా’ ఐదు భాషల్లో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు మరో సినిమాను పట్టాలెక్కించింది. కేజీఎఫ్‌ (KGF), కాంతార (Kantara) వంటి చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో దుమ్ము దులిపిన నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ (Hombale Films) ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని నిర్మిస్తోంది. ‘రగ్ తాథా’ (Raghu Thatha) పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మెయిన్ లీడ్‌. హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తున్న తొలి త‌మిళ చిత్రం కూడా ఇదే కావ‌టం గ‌మ‌నార్హం. 

ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపకుంటోంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రముఖ రైటర్‌ సుమన్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. సుమన్ కుమార్ మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మాన్', 'ది ఫ్యామిలీ మాన్ 2'లకు రచయితగా పని చేశారు. తాజాగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ లో కీర్తి లుక్ చూస్తే ఆమె పోరాట యోధురాలిగా కనిపిస్తున్నారు. ‘ఉద్యమం ఇంటి నుండే మొదలవుతుంది’ అనే ఒక ఇంట్రెస్టింగ్ కోట్ కూడా పోస్టర్ పై చూడవచ్చు. 

Read More: 'దసరా' (Dasara) సినిమా నుంచి కీర్తి సురేష్‌ (Keerthy Suresh) ఫస్ట్ లుక్.. డీ గ్లామర్ లుక్ లో అదిరిపోయిందిగా..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!