‘డేంజరస్’ (Dangerous Promotions) సినిమా ప్రమోషన్లలో అషు రెడ్డి (Ashu Reddy) కాళ్లను పట్టుకున్న ఆర్జీవీ (RGV)!

Updated on Dec 07, 2022 11:57 AM IST
బోల్డ్ యాంకర్ అషు రెడ్డి (Ashu Reddy) తో ఆర్జీవి (RGV) స్పెషల్ చిట్ చాట్ చూసిన ఆడియన్స్ బాబోయ్ అనేస్తున్నారు.
బోల్డ్ యాంకర్ అషు రెడ్డి (Ashu Reddy) తో ఆర్జీవి (RGV) స్పెషల్ చిట్ చాట్ చూసిన ఆడియన్స్ బాబోయ్ అనేస్తున్నారు.

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 30ఏళ్ల క్రితం ‘శివ’ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ఆర్జీవి ఇప్పుడు పూర్తిగా ఫేడవుట్ అయిన విషయం తెలిసిందే. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ‘డేంజరస్’. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. డిసెంబర్ 9న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ‘డేంజరస్’ (Dangerous Promotions) సినిమా ప్రమోషన్లలో నిమగ్నమయ్యాడు. ఇందులో భాగంగానే బిగ్‌బాస్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అషు రెడ్డితో ఇంటర్వ్యూ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఈ ఇంటర్వ్యూలో వర్మ.. అషు రెడ్డి కాళ్ళు పట్టుకుని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు అషు రెడ్ది కాళ్ళను ముద్దాడారు కూడా. ఇందుకు సంబంధించిన ఫోటోలను అషు రెడ్డి తన సోష మీడియా ఖాతాలో షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఇంటర్వ్యూలో అషు రెడ్డి (Ashu Reddy) కూర్చీలో కూర్చొని ఉండగా, RGV ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని ఉండడం విశేషం.

ఈ ఇంటర్వ్యూలో అషు రెడ్డి (Ashu Reddy) కూర్చీలో కూర్చొని ఉండగా, RGV ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని ఉండడం విశేషం. ఇక ఈ ఇంటర్వ్యూ చివరిలో వర్మ.. నీ కాలుని ముద్దు పెట్టుకోవాలని ఉందంటూ, ముద్దు పెట్టుకొనే వరప్రసాదం ఇవ్వాలంటూ అషు రెడ్డిని కోరతాడు. దీంతో ఆమె.. “ఇంతసేపు నా పాదాల దగ్గర ఒక భక్తుడిలా కూర్చొని నన్ను దేవతలా ట్రీట్ చేసిన నీ కోరిక తీర్చకుండా ఉంటానా” అంటూ అషు రెడ్డి బదులివ్వడం. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ ఆమె కాలుని ముద్దాడడం నెట్టింట వైరల్ గా మారింది.

అయితే, బోల్డ్ యాంకర్ తో ఆర్జీవి (RGV) స్పెషల్ చిట్ చాట్ చూసిన ఆడియన్స్ బాబోయ్ అనేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ కూడా కేవలం పెద్దవాళ్లకు మాత్రమే అని హింట్ ఇస్తున్నారు. కేవలం ఈ ఒక్క ఇంటర్వ్యూ నే కాదు. గతంలోనూ ఇలాంటి ఇంటర్వ్యూ లు చాలానే చేశారు ఆర్జీవి. యాంకర్ అరియానాతో ఇంటర్వ్యూ లో పాల్గొంటూ ఆమె తో జిమ్ లో రకరకాల ఫీట్లు చేయించారు. ఆ ఇంటర్వ్యూ కూడా ఇలాగే వైరల్ అయింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!