Indian 2: 'ఇండియ‌న్ 2' కోసం క‌మ‌ల్ హాస‌న్‌ (Kamal Haasan)కు రెమ్యునరేషన్ అన్ని కోట్లా!

Updated on Sep 25, 2022 11:00 AM IST
ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్  (Kamal Haasan) 'ఇండియ‌న్ 2' సినిమాలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో' ఇండియ‌న్ 2' ఓ రేంజ్‌లో తెర‌కెక్కుతోంది.
ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) 'ఇండియ‌న్ 2' సినిమాలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో' ఇండియ‌న్ 2' ఓ రేంజ్‌లో తెర‌కెక్కుతోంది.

Vikram : విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan)కు 'విక్రమ్' సినిమా అత్యంత భారీ హిట్‌ ఇచ్చింది. త‌మిళ‌నాడులోనే ఎక్కువ మంది ప్రేక్ష‌కులు చూసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా రూ. 450 కోట్లు వ‌సూళ్లు చేసి త‌మిళ సినిమా రంగంలో మ‌రో సంచ‌ల‌నం సృష్టించింది.

'విక్ర‌మ్' సినిమా త‌రువాత క‌మ‌ల్ హాస‌న్ 'ఇండియ‌న్ 2' సినిమాలో న‌టిస్తున్నారు. స్టార్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో' ఇండియ‌న్ 2' ఓ రేంజ్‌లో తెర‌కెక్కుతోంది. ఈ సినిమా కోసం క‌మ‌ల్ హాస‌న్ తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

విక్ర‌మ్‌తో త‌మిళ‌నాట‌ రికార్డు

'విక్ర‌మ్' అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన కోలీవుడ్ చిత్రంగా నిలిచింది. క‌మ‌ల్ హాస‌న్ న‌ట విశ్వ రూపం వ‌ల్లే ఇదంతా సాధ్యమైంద‌ని అభిమానులు అంటున్నారు. 'విక్ర‌మ్' స‌రికొత్త రికార్డుతో సంబురాలు చేసుకుంటున్నారు.

హీరో క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబోలో 'భార‌తీయుడు' సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా'ఇండియ‌న్ 2' (Indian 2) ను అత్యంత భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ 'ఇండియ‌న్ 2' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం క‌మ‌ల్ హాస‌న్ రూ. 150 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నార‌ట‌.

ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్  (Kamal Haasan) 'ఇండియ‌న్ 2' సినిమాలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో' ఇండియ‌న్ 2' ఓ రేంజ్‌లో తెర‌కెక్కుతోంది.

క‌మ‌ల్‌కు పెరిగిన డిమాండ్!

అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న హీరోల లిస్టులో ప్ర‌భాస్, అల్లు అర్జున్ ఉన్నారు. ప్ర‌భాస్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లు తీసుకుంటున్నార‌ని స‌మాచారం. ఇక అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా త‌రువాత రూ. 125 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నార‌ట‌. 'ఇండియ‌న్ 2' సినిమా కోసం క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. 

'విక్ర‌మ్' సినిమా త‌రువాత క‌మ‌ల్ హాస‌న్ సినిమాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్ప‌డింద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఇక 'ఇండియ‌న్ 2' సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించ‌నుందో చూడాలి.

ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్  (Kamal Haasan) 'ఇండియ‌న్ 2' సినిమాలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో' ఇండియ‌న్ 2' ఓ రేంజ్‌లో తెర‌కెక్కుతోంది.

'ఇండియ‌న్ 2' చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్, సిద్ధార్థ్, ర‌కుల్ ప్రీత్ సింగ్, మ‌నోబాల‌, వెన్నెల కిషోర్, సముద్ర ఖని, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌జియాంట్‌ మూవీస్‌ బ్యానర్‌లపై సుభాస్కరణ్‌, ఉదయనిధి స్టాలిన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'ఇండియ‌న్ 2' చిత్రాన్ని 2023లో రిలీజ్ చేయ‌నున్నారు. 

Read More: Indian 2 : ‘ఇండియన్ 2’ షూటింగ్‌ ప్రారంభం.. రెండేళ్ల త‌రువాత న‌టిస్తున్న‌ క‌మ‌ల్ (Kamal Haasan)?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!