ఇన్‌స్టాలో తక్కువ కాలంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్‌.. మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ (RamCharan) మరో రికార్డు

Updated on Oct 18, 2022 02:26 PM IST
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా తర్వాత రాంచరణ్‌ (RamCharan) శంకర్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా తర్వాత రాంచరణ్‌ (RamCharan) శంకర్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ (RamCharan). ఈ ఒక్క సినిమా సక్సెస్‌తోనే బాలీవుడ్‌ స్టార్ల ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. 'అల్లూరి సీతారామరాజు'గా ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇన్నాళ్లుగా టాలీవుడ్‌కే పరిమితమైన రాం చరణ్ క్రేజ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచం మొత్తం వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రాంచరణ్‌ మరో రికార్డును కూడా అందుకున్నారు. 

హిందీ ప్రేక్షకుల అభిమానంతో..

సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు సృష్టించారు. ఇన్ స్టాలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా నిలిచారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా తెచ్చిన క్రేజ్‌ కూడా రికార్డు స్థాయిలో ఫాలోవర్స్‌ను పొందడానికి దోహదపడింది. తెలుగునాట సినీ ప్రేమికులు అందరూ దాదాపుగా చెర్రీని సోషల్ మీడియాలో ఫాలో అవుతారు. అయితే హిందీ ఆడియన్స్‌ కూడా రాంచరణ్‌ను ఫాలో అవుతుండడంతో రికార్డు సాధించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న రాంచరణ్.. ఆల్‌టైమ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీంతో చెర్రీ నటుడిగ మరో మెట్టు ఎక్కుతున్నారు. శంకర్ మూవీ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఈ సినిమా రిలీజ్ అయితే రాం చరణ్ (RamCharan) రేంజ్ మరింత పెరుగుతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More : సల్మాన్‌ఖాన్ (Salman Khan) సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేసిన మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ (RamCharan)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!