Ram Gopal Varma: ప్రమోషన్స్ కోసం ఎంతకైనా దిగజారుతారా?.. ఆర్జీవీ–అషు ఇంటర్వ్యూపై నెటిజన్స్ కామెంట్స్

Updated on Dec 08, 2022 12:59 PM IST
Ram Gopal Varma: బోల్డ్ ఇంటర్వ్యూలు చేయడం ఆర్జీవీకి కొత్త కాదని.. గతంలో అరియానాతోనూ ఇలాంటి ఇంటర్వ్యూ చేశారని నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు
Ram Gopal Varma: బోల్డ్ ఇంటర్వ్యూలు చేయడం ఆర్జీవీకి కొత్త కాదని.. గతంలో అరియానాతోనూ ఇలాంటి ఇంటర్వ్యూ చేశారని నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. ఈ పేరు తెలియని భారతీయ సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. 30 ఏళ్ల కింద ఆయన తెరకెక్కించిన ‘శివ’ చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరకంగా తెలుగు సినిమా గతి మార్చిన సినిమాను ‘శివ’ను చెప్పొచ్చు. ఆ తర్వాత కూడా ‘సత్య’, ‘రంగీలా’, ‘సర్కార్’, ‘రక్త చరిత్ర’ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో ఆయన సుస్థిర స్థానాన్ని సంపాదించారు. 

ఇన్ని హిట్ సినిమాలను తీసిన ఆర్జీవీ ఈ మధ్య కాలంలో బాగా వెనుకబడిపోయారు. ‘రక్త చరిత్ర’ చిత్రం తర్వాత ఆయన నుంచి ఆ స్థాయి సినిమా మళ్లీ రాలేదు. ‘రక్త చరిత్ర’ తర్వాత కొన్ని సినిమాలు యావరేజీగా నిలవగా.. మరికొన్ని అసలు రామ్ గోపాల్ వర్మనేనా వీటిని తెరకెక్కించింది అనేలా ఉన్నాయని సాధారణ ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా పెదవి విరిచారు. అయితే ఆర్జీవీ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా తనదైన స్టైల్‌లో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. 

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘డేంజరస్’ చిత్రం (Dangerous Promotions) ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ.. డిసెంబర్ 9న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్న ఆర్జీవీ.. హాట్ బ్యూటీ అషు రెడ్డి (Ashu Reddy)తో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఏకంగా అషు కాళ్లు పట్టుకుని అందర్నీ ఆయన ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఆమె కాళ్లను ముద్దాడారు కూడా. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఇకనైనా మానుకోవాలంటున్న నెటిజన్స్
ఆర్జీవీ–అషు ఇంటర్వ్యూ ఎపిసోడ్ ముగిసి ఒక రోజు కావొస్తున్న ఆ వేడి మాత్రం తగ్గలేదు. ఇంటర్వ్యూలో ఆర్జీవీ చేష్టల గురించి సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా అని కొందరు ఆర్జీవీని విమర్శిస్తున్నారు. మరికొందరేమో ఇలాంటి వాటితో ఫేమ్‌ను పెంచుకుందామంటే కుదరదని, రామ్ గోపాల్ వర్మ ఇప్పటికైనా ఇలాంటి చేష్టలను మానుకోవాలని సూచిస్తున్నారు. 

సక్సెస్ బాట పట్టేనా..?
ఇకపోతే, గతంలోనూ వర్మ ఇదే రకమైన బోల్డ్ వీడియోతో అందర్నీ షాక్ చేశారు. యాంకర్ అరియానాతో ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆమెతో రకరకాలు ఫీట్లు చేయించారు. ఆ ఇంటర్వ్యూ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. కాగా, ఆర్జీవీ రూపొందించిన ‘డేంజరస్’ సినిమాలో అప్సరా రాణి, నైనా గంగూలి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరూ లెస్బియన్స్‌గా యాక్ట్ చేయడం విశేషం. ఇందులో పాలక్ సింగ్, రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూనే స్వయంగా నిర్మించారు ఆర్జీవీ. మే నెలలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు రేపు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. మరి, ఈ సినిమాతోనైనా ఆర్జీవీ సక్సెస్ బాట పడతారేమో చూడాలి. 

Read more: ఐఎం‌డీబీ (IMDB) మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ టాప్ 10 జాబితాలో ముగ్గురు తెలుగు హీరోలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!