జపాన్ లో విడుదల కాబోతున్న 'ఆర్ఆర్ఆర్' (RRR).. ప్రమోషన్ల కోసం సతీసమేతంగా బయల్దేరిన రామ్ చరణ్ (Ram Charan)

Published on Oct 18, 2022 05:39 PM IST

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ RC15 లో  నటిస్తూనే తర్వాతి సినిమా కోసం కథలు వింటున్నాడు. 

ఇదిలా ఉంటే.. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాకు ఫుల్ ఫిదా అయ్యారు.

ఈ నేపథ్యంలో RRR సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లోకి డబ్ చేసి అక్కడ కూడా విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే జపాన్‌ (Japan)లో అక్టోబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. 

ఈ క్రమంలో అక్కడ ప్రమోషన్ల కోసం రామ్ చరణ్ (Ram Charan) జపాన్‌కు బయలుదేరాడు. ఆయన వెంట తన సతీమణి ఉపాసన (Upasana) కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి ప్రైవేట్ ఛార్టెడ్ ఫ్లైట్‌లో జపాన్‌కు వెళ్లారు. వీరితో పాటు పెంపుడు కుక్క రైమ్ కూడా ఉంది. ఇక, ఎయిర్ పోర్టులో ఉపాసనతో కలిసి రామ్ చరణ్ దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read More: వెకేషన్ తర్వాత ఎయిర్ పోర్టులో భార్య ఉపాసనతో (Upasana) దర్శనమిచ్చిన రామ్ చరణ్ (Ram Charan).. ఫొటోలు వైరల్!