ఆర్‌‌సీ15లో సీనియర్ హీరోయిన్.. రాంచరణ్‌ (RamCharan) – శంకర్‌‌ సినిమాలో కీలకపాత్రలో ఖుష్బూ!

Updated on Oct 17, 2022 02:50 PM IST
మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ (RamCharan) శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ (RamCharan) శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ (RamCharan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆర్‌‌సీ15 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత చరణ్‌ నటిస్తున్న సినిమా కావడం.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతుండడంతో ఆర్‌‌సీ15పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు తప్పకుండా ఉంటారు. ఈ సినిమాలో కూడా అదే స్థాయి తారాగణం నటిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్‌‌సీ15 సినిమాలో చరణ్ డ్యూయర్‌‌ రోల్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య కీలకపాత్ర పోషిస్తున్నారు. కాగా, ఆర్‌‌సీ15 సినిమా గురించిన మరో అప్‌డేట్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ (RamCharan) శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తప్పని లీకుల బెడద..

రాంచరణ్‌ హీరోగా నటిస్తున్న ఆర్‌‌సీ15 సినిమాలో సీనియర్ హీరోయిన్ కీలకపాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఖుష్బూ.. స్టాలిన్ సినిమాలో చిరుకి అక్కగా కూడా కనిపించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్‌ చేసి మంచి పాత్రలు చేస్తున్నారు ఖుష్బూ. ఈ క్రమంలోనే శంకర్‌‌ – రాంచరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న ఆర్‌‌సీ15లో నటిస్తున్నారని టాక్.

కాగా, ఆర్‌‌సీ15 సినిమాకు లీకుల బాధ తప్పడం లేదు. చరణ్ సైకిల్ తొక్కుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక, తాజాగా ఆర్‌‌సీ15లో చరణ్, అంజలి ఫోటోలకు సంబంధించిన స్టిల్స్‌ కూడా లీక్ అయ్యాయి. ఈ ఫోటోల ప్రకారం చరణ్‌, అంజలి భార్యాభర్తలుగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి పక్కన ఉన్న బాబు యంగ్‌ రాంచరణ్‌ అని తెలుస్తోంది. ఈ ఫోటోల్లో రాం చరణ్‌ (RamCharan).. పంచెకట్టుతో పల్లెటూరిలో ఉండే రైతుగా కనిపిస్తున్నారు

Read More : సల్మాన్‌ఖాన్ (Salman Khan) సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేసిన మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ (RamCharan)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!