‘కాంతార’ (Kantara) సినిమా డైరెక్టర్‌‌పై మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ (Ram Charan) నజర్.. సినిమా తీయాలని ప్లాన్!

Updated on Oct 27, 2022 04:27 PM IST
మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ (RamCharan) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ (RamCharan) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ (RamCharan).. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం శంకర్‌‌ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు చరణ్. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా జపాన్‌లో విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నారు రాంచరణ్.

ఇక, ప్రస్తుతం ఇండస్ట్రీలో పాపులర్ అయిన సినిమా కాంతార (Kantara). ఈ సినిమా ఎంత పెద్ద సంచలనాన్ని సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడలో తెరకెక్కించిన కాంతార సినిమా తెలుగులోకి డబ్‌ చేశారు. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్‌ రెండు కోట్లకు కొనుగోలు చేసి విడుదల చేశారు. ఈ సినిమా ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది. సినీ ప్రేమికులను అలరించడంతోపాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటోంది కాంతార సినిమా.

కన్నడ నేటివిటీకి దగ్గరగా ఉన్న కారణంగా కన్నడ ప్రజలు కాంతార సినిమాను ఓ రేంజ్‌లో ప్రమోట్‌ చేశారు. సినిమాకు వచ్చిన ఇమేజ్‌తో ఇతర భాషల్లోకి కూడా సినిమాను విడుదల చేయాలని సినీ ప్రేమికులు ఎదురుచూశారు. దీంతో కాంతార సినిమాను పలు భాషల్లోకి డబ్‌ చేసి విడుదల చేశారు మేకర్స్.  

మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ (RamCharan) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సినిమా చేయాలని చాలామంది..

కాంతారా సినిమా ఇంత పెద్ద హిట్ సాధించడానికి కారణం డైరెక్టర్ రిషబ్ శెట్టి అని అందరూ అనుకుంటున్నారు. సినిమాలో ప్రతి సన్నివేశం అంత నేచురల్‌గా రావడానికి రిషబ్‌ శెట్టి నటన కూడా కారణం అని టాక్. ఇప్పుడు అందరి ఆలోచనలు కాంతార చుట్టూనే తిరుగుతున్నాయి. రిషబ్‌శెట్టి దర్శకత్వంలో సినిమా చేయాలని ఆశపడుతున్నారు.

ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా రిషబ్ శెట్టి దర్శకత్వానికి ఫిదా అయినట్టు తెలుస్తోంది . అంతేకాదు కాంతార (Kantara) సినిమా సక్సెస్‌పై రిషబ్ శెట్టికి పర్సనల్‌గా కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారని.. ఆయన డైరెక్షన్‌లో ఒక సినిమాలో నటించాలని చెప్పుకొచ్చారనే న్యూస్ వైరల్​గా మారింది. దీంతో త్వరలోనే రిషబ్‌శెట్టి (Rishab Shetty) డైరెక్షన్‌లో రాంచరణ్ (RamCharan) సినిమా తెరకెక్కించబోతున్నారనే వార్త ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Read More : సల్మాన్‌ఖాన్ (Salman Khan) సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేసిన మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ (RamCharan)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!