పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఓకే అంటే ‘ఖుషి’ (Kushi) పార్ట్‌2 తెరకెక్కిస్తా : ఎస్‌జే సూర్య

Updated on Oct 13, 2022 12:21 PM IST
పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటించిన ఖుషి (Kushi) సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ సాధించిన విషయం తెలిసిందే
పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటించిన ఖుషి (Kushi) సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ సాధించిన విషయం తెలిసిందే

పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కెరీర్‌‌ను మలుపుతిప్పిన సినిమాల్లో ఖుషి (Kushi) ఒకటి. ఎస్‌జే సూర్య డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా పవన్ అభిమానులతోపాటు సినీ ప్రేమికులను కూడా అలరించింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌ సినిమాలతోపాటు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఖుషి సినిమాకు దర్శకత్వం వహించిన ఎస్‌జే సూర్య ప్రస్తుతం నటుడిగా కూడా బిజీ అయ్యారు. దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ సినిమాలను తెరకెక్కించిన సూర్య.. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పవన్ కల్యాణ్, భూమిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఖుషి సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. మణిశర్మ సంగీతం అందించిన ఖుషి సినిమాలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి.

పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటించిన ఖుషి (Kushi) సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ సాధించిన విషయం తెలిసిందే

వెంటనే సెట్స్‌పైకి తీసుకెళతా..

ఇటీవల మీడియాతో మాట్లాడిన ఎస్‌జే సూర్య.. ఖుషి సినిమాకు సీక్వెల్‌పై ఆసక్తికర కామెంట్లు చేశారు. ఖుషి2 సినిమాకు కథ సిద్ధంగా ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఖుషి (Kushi) పార్ట్‌2 తెరకెక్కిస్తానని చెప్పారు. ఆయన ఓకే అంటే సినిమాను వెంటనే సెట్స్‌పైకి తీసుకెళతానని అన్నారు. ఎస్‌జే సూర్య మానాడు, డాన్ సినిమాలలో కీలకపాత్రల్లో నటించారు. ప్రస్తుతం సూర్య.. మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ – శంకర్‌‌ కాంబినేషన్‌లో ఆర్‌‌సీ15 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. మరి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)ను ఎస్‌జే సూర్య ఎప్పుడు కలిసి కథ చెప్తారోనని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read More : 9 Years for Attarintiki Daredi : పవన్ కళ్యాణ్ చిత్రం "అత్తారింటికి దారేది"కి 9 ఏళ్ళు.. టాప్ 10 విశేషాలివే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!