టెంపుల్‌ సెట్‌లో ప్రభాస్ (Prabhas) ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా షూటింగ్‌.. కీలక సన్నివేశాల చిత్రీకరణ!

Updated on Oct 26, 2022 10:14 PM IST
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  నటిస్తున్న ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో సెప్టెంబర్ లో జరిగింది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో సెప్టెంబర్ లో జరిగింది

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న మరో క్రేజీ సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్. భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఇప్పటివరకు రూపొందని కథతో ప్రాజెక్ట్‌ కె సినిమాను తీస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథను రహస్యంగా ఉంచుతోంది చిత్ర యూనిట్. 

‘ప్రాజెక్ట్‌ కె’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనె నటిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్ట్‌ కె చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్‌‌ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్‌‌ హీరోగా నటిస్తున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్‌‌ నెలలో రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్ జరిగింది. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  నటిస్తున్న ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో సెప్టెంబర్ లో జరిగింది

పాన్ వరల్డ్‌ లెవెల్‌లో..

ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీ శివార్లలో ప్రాజెక్ట్‌ కె సినిమా కోసం టెంపుల్‌ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెట్‌లో హీరోహీరోయిన్ల మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి, సాహో, రాధే శ్యామ్ సినిమాలతో పాన్‌ ఇండియా స్టార్‌‌గా ఎదిగిన ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్‌ కె సినిమాను పాన్ వరల్డ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రభాస్‌ (Prabhas) ప్రాజెక్ట్‌ కె సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి సినిమాలతో పాపులర్‌‌ అయిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. ప్రాజెక్ట్‌ కె సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2023, అక్టోబర్‌‌ 18వ తేదీన లేదా 2024 సంక్రాంతి పండుగకు సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత అశ్వినీదత్‌ తెలిపారు.

Read More : ప్రభాస్ (Prabhas) బర్త్‌డే సందర్భంగా అభిమానులకు మాస్‌ ఫీస్ట్‌.. సలార్‌ (Salaar)లో డార్లింగ్‌ లుక్‌ వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!