‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటున్న పవన్ కళ్యాణ్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagath Singh) టైటిల్ పోస్టర్ రిలీజ్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalayan) స్పీడు మీదున్నారు. ఇటీవలే ‘సాహో’ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసిన ఆయన తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘భవదీయుడు భగత్ సింగ్’ అంటూ ఇప్పటికే టైటిల్ త పాటు, పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
గత కొంతకాలంగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. పవన్ రాజకీయాల షెడ్యూల్స్ వల్ల, దీని కంటే ముందు హరిహర వీరమల్లు సినిమా ఉండటం వల్ల ఈ సినిమా డిలే అవుతుంది. ఇటీవల ఈ సినిమా తమిళ్ సినిమా దళపతి విజయ్ నటించిన ‘తేరి’ (Theri Remake) రీమేక్ అని వార్తలు రావడంతో పవన్ ఫ్యాన్స్ రీమేక్ అయితే చేయొద్దంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు.
దీంతో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ (Harish Shankar) కాంబో మూవీపై అందరిలో ఆసక్తి పెరిగింది. దీనికి తోడు ఈ సినిమాపై నెట్టింట జోరుగా వార్తలు రావటం మొదలయ్యాయి. అయితే ఈ వార్తలన్నింటికీ సమాధానం చెబుతూ పవన్ కళ్యాణ్‌తో తాను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagath Singh) సినిమాను చేయబోతున్నట్లు హరీష్ ప్రకటించేశారు.
ఈ మేరకు పోస్టర్ ను (Ustad Bhagath Singh Poster) విడుదల చేశారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్యాగ్ లైన్ తో పాటు, ఈ సారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అనే మూవీ థీమ్ లైన్ కూడా ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానున్నట్లు చిత్రం యూనిట్ తెలిపింది. ఇందులో పవన్ బైక్ కి ఆనుకొని స్టైల్ గా నిల్చొని ఉన్నాడు. బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించి దానిపై వైట్ కలర్ జర్కిన్ వేసుకొని.. ఒక చేత్తో బైక్ హ్యాండిల్ పట్టుకొని.. మరో చేత్తో టీ గ్లాస్ పట్టుకొని పవన్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఆయన వెనకాలే... పవర్ డిస్ట్రిబ్యూషన్ టవర్స్‌తో పాటు.. ఆకాశంలో మెరుపులు ఉరుములు కూడా కనిపిస్తున్నాయి.
అయితే, ఎలాంటి అప్డేట్ లేకుండా సడెన్ గా ఉదయమే ఈ పోస్టర్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ సినిమా ‘తేరి’ రీమేక్ అవునో కాదో మాత్రం చెప్పలేదు హరీష్ శంకర్. త్వరలోనే ఈ సినిమా షూట్ మొదలవుతుందని ట్వీట్ లో తెలిపారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ కొన్నేళ్ల క్రితం తెరకెక్కించిన ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) మూవీ అప్పట్లో పెద్ద సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మాతగా రూపొందిన ఆ మూవీలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్, యాక్టింగ్, స్టైల్ కి విపరీతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అది ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్ధం చేసుకోవచ్చు.
Read More: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేకుండానే 'హరిహర వీరమల్లు' (HariHara Veeramallu) యాక్షన్ సీక్వెన్స్..?