20ఏళ్ల తర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. డైరెక్టర్ క్రిష్ (Krish) కామెంట్స్ వైరల్!

Updated on Dec 10, 2022 10:24 AM IST
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Martial Arts) షేర్ చేసిన మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ ఫొటో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Martial Arts) షేర్ చేసిన మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ ఫొటో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది.

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (HariHara VeeraMallu). మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని దయాకర్ రావు నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఇది విడుదల కానుంది. 17వ శ‌తాబ్దానికి చెందిన ఈ సినిమాలో పవన్ (Pawan Kalyan) .. రాబిన్ హుడ్ త‌రహా పాత్ర‌ను పోషిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కారణంగా పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్, కత్తి సాము, గుర్రపు స్వారీ చెయ్యాల్సి ఉంది. అందుకే ఆయన మళ్ళీ యుద్ధ విద్యలలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 

అయితే, ఇప్పటికే పవన్ కత్తి స్వాము, గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోలు వైరల్ అవ్వగా.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Martial Arts) షేర్ చేసిన మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ ఫొటో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఈ క్రమంలో ఆయన తాజాగా చేసిన ట్వీట్‌ నెట్టింట వైరలవుతోంది. ‘మళ్లీ 20ఏళ్ల తర్వాత మొదలు పెట్టాను’ మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న ఫొటోను జత చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. 20ఏళ్ల అయినా మీలో ఫైర్‌ ఏమాత్రం తగ్గలేదు అన్నా.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక దీనిపై డైరెక్టర్ క్రిష్‌ కూడా స్పందించాడు. ‘పవన్ కళ్యాణ్‌ సర్.. హరి హర వీరమల్లు సెట్స్‌లో ఇలా ముందు వరుసలో కూర్చుని మీ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని చూడటం నాకు ఎంతో సంతోషంగా, గౌరవంగా అనిపిస్తోంది.. అభిమానులకు, సినీ ప్రేక్షకులకు, ఈ ప్రపంచానికి మీ ప్యాషన్, డెడికేషన్, కష్టపడేతత్వాన్ని చూపించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అంటూ క్రిష్‌ ట్వీట్ చేశాడు.

మార్షల్ ఆర్ట్స్ గురించి చెప్పిన మాటలు, ప్రాక్టీసును పవర్ స్టార్ గుర్తు చేసుకున్నారు. కాగా, పవన్ కల్యాణ్ చివరగా ‘జాని’ చిత్రం కోసం తనలోని ప్రతిభను బయటపెట్టారు. ఇదిలా ఉంటే.. హరి హర వీర మల్లు (HariHara VeeraMallu) సినిమా పూర్తి కాగానే ... పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలు చేయటానికి రెడీ అవుతున్నారు. అందులో ఓ చిత్రానికి సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహించబోతున్నారు. మరో చిత్రానికి హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా ప్రకటన త్వరలోనే రానుంది.

Read More: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేకుండానే 'హరిహర వీరమల్లు' (HariHara Veeramallu) యాక్షన్ సీక్వెన్స్..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!