పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) కోసం కథ రాస్తున్న పరశురాం.. పవర్‌‌స్టార్‌‌ను డైరెక్ట్‌ చేసే చాన్స్ దక్కేనా?

Updated on Oct 15, 2022 03:37 PM IST
పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు  వచ్చే ఏడాది విడుదల కానుంది
పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు వచ్చే ఏడాది విడుదల కానుంది

పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. రాజకీయాలు, సినిమాలతో ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటారు. ఆయన కోసమే ప్రత్యేకంగా కథలు కూడా రెడీ చేస్తుంటారు దర్శకులు. ఇప్పటికే చాలా మంది పవన్‌తో సినిమా చేయడానికి లైన్‌లో ఉన్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి డైరెక్టర్ పరశురాం చేరారు.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుతో సర్కారు వారి పాట సినిమా తీసి హిట్‌ కొట్టారు దర్శకుడు పరశురాం. మే నెలలో విడుదలైన సర్కారు వారి పాట సినిమా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా.. మహేష్‌కు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే సినిమా విడుదలై దాదాపుగా 6 నెలలు గడుస్తున్నా.. తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించలేదు పరశురాం. ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్‌తో అక్కినేని నాగచైతన్య హీరోగా సినిమా చేయాలని అనుకున్నారు. ఈ విషయాన్ని నాగచైతన్య కూడా ఓకే చేసినా ఎందుకో షూటింగ్ స్టార్ట్ కాలేదు.

ప్రస్తుతం నాగచైతన్య వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యేవరకు చైతూ కోసం పరశురాం వెయిట్ చేయక తప్పదు. ఈ సమయంలో ఖాళీగా ఉండకుండా పవర్‌‌స్టార్‌‌ కోసం కథ రెడీ చేసే పనిలో పడ్డారట పరశురాం. త్వరలోనే పవన్‌కు కథ వినిపించనున్నారని టాక్. కాగా, నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌కు పవన్‌ సినిమా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకున్నారని సమాచారం.

పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు  వచ్చే ఏడాది విడుదల కానుంది

పట్టాలెక్కుతుందా?

ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. పరశురాం కథ పూర్తి చేసిన తర్వాత పవన్‌ కల్యాణ్‌కు వినిపిస్తారని, కథ ఆయనకు నచ్చి గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. మరి పరశురాంకు పవన్‌ ఓకే చెప్తారా? లేదా? అనే విషయం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

 ఇక పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో  పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నర్గీస్ ఫక్రి కీలకపాత్ర పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కాకుండా ‘వినోదయ సీత్తం’ రీమేక్‌లో నటించడానికి ఓకే చెప్పారు పవన్‌ కల్యాణ్. అలాగే పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేయడానికి  చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు డైరెక్టర్ హరీష్‌ శంకర్.

Read More : పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఓకే అంటే ‘ఖుషి’ (Kushi) పార్ట్‌2 తెరకెక్కిస్తా : ఎస్‌జే సూర్య

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!