Pawan Kalyan: పవర్ స్టార్ సినిమా రిలేటెడ్ పోస్ట్ పెడితే రెస్పాన్స్ ఈ రేంజ్‌లో ఉంటుందా..?

Updated on Dec 10, 2022 05:24 PM IST
దాదాపు రెండు దశాబ్దాల కింద వదిలేసిన మార్షల్ ఆర్ట్స్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)​ మళ్లీ సాధన చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది
దాదాపు రెండు దశాబ్దాల కింద వదిలేసిన మార్షల్ ఆర్ట్స్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)​ మళ్లీ సాధన చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)​ సినిమా వస్తోందంటే చాలు ఆయన అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు. అలాంటి పవన్ తెరపై కనిపించి దాదాపు పది నెలలు కావొస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తమ హీరో వినోదాన్ని పంచాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉండటం, మరోవైపు ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ను క్వాలిటీ పేరుతో క్రిష్​ ఆలస్యంగా తీస్తున్నారు. దీంతో పవర్ స్టార్‌ను మళ్లీ థియేటర్స్‌లో చూడాలంటే వచ్చే సమ్మర్ వరకు వేచి చూడక తప్పని పరిస్థితి. 

‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) ఓ చారిత్రాత్మక సినిమా అని.. పవన్ కెరీర్‌లో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఇలాంటి చిత్రాలను తెరకెక్కించే విషయంలో ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. కాబట్టి పవన్ ఫ్యాన్స్ తమకు మద్దతుగా నిలవాలని కోరారు. ఇదిలాఉంటే.. ఇటీవలే ‘వీరమల్లు’ షూటింగ్ మళ్లీ మొదలైంది. ఇందులో చురుగ్గా పాల్గొంటున్న పవన్.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎఫర్ట్‌ పెడుతున్నారు.      

ఫస్ట్ టైమ్ సినిమా అప్‌డేట్..!
దాదాపు రెండు దశాబ్దాల కింద వదిలేసిన మార్షల్ ఆర్ట్స్‌ను పవన్ మళ్లీ సాధన చేస్తున్నారు. ‘వీరమల్లు’లో పోరాట సన్నివేశాల కోసమే ఆయన ఈ కసరత్తులు చేస్తున్నారని అర్థమవుతోంది. ఈ సినిమాను ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నట్లే కనిపిస్తోంది. తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో రాజకీయాలు, ప్రజా సమస్యల గురించి తప్ప.. సినిమాల విషయాలను ఎన్నడూ పవన్ షేర్ చేయరు. కానీ తొలిసారిగా ‘వీరమల్లు’ కోసం తాను మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను ఆయన పంచుకున్నారు. 

పవన్ మార్షల్ ఆర్ట్స్ పోస్ట్‌కు విపరీతమైన ఆదరణ వచ్చింది. ఈ పోస్ట్‌కు 24 గంటలు గడవకుండానే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో పవన్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ పెడితే ఎలా ఉంటుందో, ఆయన స్టార్ పవర్ ఏమిటో ఈ పోస్ట్ నిరూపించిందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. మరి, పవన్ ఇంతలా శ్రమిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందేమో చూడాలి. 

Read more: Most Trolled Telugu Movies : 2022లో అత్యధికంగా ట్రోల్ అయిన తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!