Ram Pothineni : రామ్-బోయపాటి శ్రీను (Boyapati Srinu) సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి..!

Updated on Oct 18, 2022 01:02 PM IST
బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని (Suniel Shetty) ఈ సినిమాలో రామ్ తండ్రి పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని (Suniel Shetty) ఈ సినిమాలో రామ్ తండ్రి పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రామ్ కెరియర్ కి చాలా కీలకమని చెప్పవచ్చు. 'అఖండ' వంటి భారీ హిట్ విజయం తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై రామ్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. 

పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) హిట్ తరువాత రామ్ నటించిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘ది వారియర్’ భారీ డిజాస్టర్ గా నిలిచింది. అందుచేతనే ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలకు తగ్గట్టుగా డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాని తీసుకువస్తాడని చాలా నమ్మకంతో ఉన్నారు. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం అయ్యింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బోయపాటి స్టైల్ మేకింగ్ తోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఇక ఈ మూవీలో శ్రీలీల (Sree Leela) హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ బ్యూటీకి ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామ్-బోయపాటి (Ram Pothineni) సినిమా షూటింగ్ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం అయ్యింది.

ఈ సినిమాలో రామ్ తండ్రి పాత్ర చాలా కీలకమట. దీంతో ఇప్పటికే 'గని', 'మోసగాళ్ళు' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన వెటరన్ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని (Suniel Shetty) ఈ సినిమాలో రామ్ తండ్రి పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బోయపాటి ఆయనకు కథ వినిపించడం కూడా జరిగిపోయిందని టాక్ వినిపిస్తోంది. 

ఈ మూవీలో తండ్రి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, అందుకే బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న సునీల్ శెట్టి అయితే బెటర్ అని అతన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై రామ్ (Ram Pothineni) అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ శెట్టి దక్షిణాదిలో చేసిన ఏ సినిమా కూడా ఇప్పటివరకు హిట్ కాలేదు, పైగా భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. అందుకే.. ఇది ఒక బ్యాడ్ సెంటిమెంట్ అంటూ హీరో రామ్ అభిమానులు కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి, అంచనాలకు తగ్గట్టు బోయపాటి శ్రీను (Boyapati Srinu) ఈ సినిమాను తెరకెక్కిస్తాడా? టాలీవుడ్ లో సునీల్ శెట్టి ఈ సినిమాతో ఫ‌స్ట్ కమర్షియల్ సక్సెస్ దక్కించుకుంటాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Read More: బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని (Ram Pothineni).. తన లుక్‌ని పూర్తిగా మార్చబోతున్న యంగ్ హీరో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!