బోయపాటి (Boyapati)-రామ్ (Ram Pothineni): అదిరిపోయే ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ భామ ఊర్వ‌శి రౌటేలా (Urvashi Rautela)

Updated on Oct 27, 2022 06:56 PM IST
ఈ సినిమాలోని ఐటెంసాంగ్‌లో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వ‌శి రౌటేలా (Urvashi Rautela) న‌టించ‌నున్న‌ట్లు తెలిస్తోంది.
ఈ సినిమాలోని ఐటెంసాంగ్‌లో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వ‌శి రౌటేలా (Urvashi Rautela) న‌టించ‌నున్న‌ట్లు తెలిస్తోంది.

టాలీవుడ్ యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) స్టార్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న తెలిసిందే. మాస్‌ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా హీరోగా రామ్ 20వ చిత్రం (RAPO20). ఇందులో రామ్ కి జంటగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela) కనిపించనుంది. ఇక, ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌ కంటెంట్‌తో క్లాస్‌, మాస్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఈ సినిమా ఉండబోతుందని టాక్‌. కాగా ఈ సినిమాలోని ఐటెంసాంగ్‌లో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వ‌శి రౌటేలా (Urvashi Rautela) న‌టించ‌నున్న‌ట్లు తెలిస్తోంది. ఈ సందర్భంగా రామ్ తో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఊర్వశి. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.

ఊర్వశి రౌటేలా (Urvashi Rautela).. ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. అలాగే ఐటెం సాంగ్స్ లో కూడా కనిపించింది. ఇప్పుడు తెలుగు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇదివరకే సంపత్ నంది దర్శకత్వంలో 'బ్లాక్ రోజ్' అనే సినిమాలో నటించింది ఈ భామ. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బోయపాటి (Boyapati Sreenu)-రామ్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది ఊర్వశి.

అంతేకాదు ఎప్పుడు లేని విధంగా ఈ స్పెషల్ సాంగ్ లో బోయపాటి శ్రీను (Boyapati Sreenu) తొలిసారి ఐటెం సాంగ్ లో హీరో హీరోయిన్ కి లిప్ లాక్ పెట్టేలా ప్లాన్ చేశాడట. దీంతో ఒక్కసారిగా రామ్-బోయపాటి సినిమా న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

కాగా, హీరో రామ్ చివరగా నటించిన మూవీ ‘ది వారియర్’ (The Warrior). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ నటనకు మైనస్ మార్కులు పడ్డాయి. అంతేకాదు ఈ సినిమాలో ఆయన కృతి శెట్టితో చేసిన రొమాన్స్ అసలు వర్కవుట్ కాలేదు. ఈ క్రమంలోనే తన ఆశలన్నీ బోయపాటి సినిమాపై పెట్టుకున్నాడు రామ్. ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ కానీ ఈ చిత్రం 2023 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!