'ఎన్టీఆర్ 30' (NTR30) సినిమాపై రూమర్లు.. వినూత్న రీతిలో సమాధానమిచ్చిన దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)

Updated on Nov 07, 2022 11:11 AM IST
రూమర్లకి చెక్ పెట్టారు దర్శకుడు కొరటాల శివ. 'ఎన్టీఆర్ 30' (NTR30) చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి.
రూమర్లకి చెక్ పెట్టారు దర్శకుడు కొరటాల శివ. 'ఎన్టీఆర్ 30' (NTR30) చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి.

'ఆర్ఆర్ఆర్' (RRR) వంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR) తదుపరి సినిమాపై ఎన్నో అంచనాలతో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే, ఆ సినిమా తరువాత ఇప్పటివరకు ఏ సినిమానూ మొదలుపెట్టలేదు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో వరుసగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వంలో ఆయన సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు. 

అయితే, ఎన్టీఆర్ ముందుగా కొరటాల శివ (Koratala Siva) సినిమాను మొదలుపెట్టాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇదిగో అదిగో అంటున్నారు తప్ప కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమాకు మాత్రం ముహూర్తం కుదరడం లేదు. దీంతో ఈ సినిమా ఇక ఉండదని, కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని ఆపేశారనే రూమర్లు బయటకొచ్చాయి. 

ఈ నేపథ్యంలో రూమర్లకి చెక్ పెట్టారు దర్శకుడు కొరటాల శివ. 'ఎన్టీఆర్ 30' (NTR30) చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రం త్వరలోనే పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో, ప్రారంభ షెడ్యూల్ కు సంబంధించిన చర్చల్లో దర్శకుడు కొరటాల శివ, కెమెరామన్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ పాల్గొన్నారు. 

తాజాగా ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రారంభించినట్లు నిర్మాణ సంస్థ ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో దర్శకుడు కొరటాల శివ, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ తో కలిసి చర్చిస్తున్నట్లుగా ఉంది. ఈ నెలలోనే ఫార్మల్ గా సినిమాను లాంచ్ చేసి.. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి ఎన్టీఆర్30 టీమ్ నుంచి మెల్లగా అప్డేట్స్ రావడం మొదలయ్యాయి. 

ఈ భారీ పాన్ ఇండియా మూవీకి యువ సంగీత సంచలనం అనిరుధ్ (Anirudh) సంగీతాన్ని అందించబోతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కొరటాల శివకు సన్నిహితుడైన మిక్కినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య' (Acharya) తో డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి తప్పులు జరగకూడదని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ కారణంగానే సినిమా ఆలస్యమవుతున్నట్లు సమాచారం. 

ఇక, ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. హిందీ హీరోయిన్ ను తీసుకుంటే పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్ కి పనికొస్తుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోయిన్లతో పాటు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) లాంటి వాళ్లను కూడా పరిశీలిస్తున్నారట దర్శక నిర్మాతలు.

Read More: NTR30: ‘ఎన్టీఆర్ 30’ పై అదిరిపోయే అప్డేట్.. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం.. త్వరలో షూటింగ్ స్టార్ట్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!