Gurthunda Seethakalam: ఆ కారణంతోనే ఈ మూవీ చేశా.. ‘గుర్తుందా శీతాకాలం’ అందరికీ నచ్చుతుంది: సత్యదేవ్ (Satyadev)

Updated on Dec 09, 2022 01:45 PM IST
తమన్నా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని తెలియగానే షాకయ్యానని సత్యదేవ్ (Satyadev) అన్నారు. ఆమె ఇందులో నిధి అనే పాత్రలో కనిపిస్తారని చెప్పారు
తమన్నా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని తెలియగానే షాకయ్యానని సత్యదేవ్ (Satyadev) అన్నారు. ఆమె ఇందులో నిధి అనే పాత్రలో కనిపిస్తారని చెప్పారు

స్టార్ నటులు ఎందరున్నా సత్తా ఉన్న యువ నటులు వస్తేనే ఇండస్ట్రీలో మెరుగైన సినిమాలు వస్తాయని విశ్లేషకులు అంటుంటారు. యువ ప్రతిభావంతులు పెద్ద నటులకు దీటుగా మంచి కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తే ప్రేక్షకులకు కూడా క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుందని చెబుతుంటారు. అలాంటి యంగ్ యాక్టర్స్‌లో సత్యదేవ్ (Satyadev) ఒకరు. తనదైన మార్క్ నటనతో, హావభావాలతో యువతరంతోపాటు కుటుంబ ప్రేక్షకుల్లోనూ ఆయన మంచి గుర్తింపు సంపాదించారు. 

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు సత్యదేవ్. ఇటీవల విడుదలైన ‘గాడ్‌ఫాదర్’లో మెగాస్టార్ చిరంజీవికి ప్రతినాయకుడిగా నటించి మెప్పించారాయన. అలాగే రీసెంట్‌గా ‘రామసేతు’ అనే హిందీ చిత్రంలోనూ కీలక పాత్రలో సత్యదేవ్ సత్తా చాటారు. ఇప్పుడు హీరోగా ‘గుర్తుందా శీతాకాలం’తో ఆడియెన్స్‌ను మరోసారి పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. కన్నడలో సక్సెస్ సాధించిన ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా ఈ మూవీ రూపొందింది. నాగశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా విలేకర్లతో పలు విశేషాలను సత్యదేవ్ పంచుకున్నారు. 

 ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) లాంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు సంతోషంగా ఉందని సత్యదేవ్ అన్నారు

‘ఈ సంవత్సరం నా నుంచి వస్తున్న ఐదో సినిమా ఇది. చాలా హ్యాపీగా ఉంది. చిరంజీవి (Chiranjeevi) అన్నయ్య ముందే చెప్పినట్లుగా ‘గాడ్‌ఫాదర్‌’తో నేను చాలా మందికి దగ్గరయ్యా. ఇలాంటి తరుణంలో ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) లాంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇందులో దేవ్‌ అనే పాత్రలో కనిపిస్తా. అతడి జీవితంలోని నాలుగు ప్రేమకథల్ని ఈ సినిమాలో చూపించనున్నాం. ఇలాంటి మూవీ నేనిప్పటి వరకు చేయలేదు. తమన్నా పాత్ర ప్రవేశించాక ఈ చిత్ర స్వరూపమే మారిపోతుంది. ఒకే సినిమాలో మూడు భిన్న వయసులున్న పాత్ర చేసే అవకాశం రావడం చాలా అరుదు. కాబట్టి ప్రేక్షకుల్ని ఒప్పించడానికి ఈ పాత్రల కోసం చాలా కష్టపడ్డా’ అని సత్యదేవ్ చెప్పుకొచ్చారు.

ఆమె ఒప్పుకోవడంతో షాకయ్యా..!
‘గుర్తుందా శీతాకాలం’ మంచి సినిమా. ఇందులో కాలేజీ సీన్స్‌ ఉన్నాయి. ఈ వయసులో చేయకపోతే తర్వాత చేయలేం కాబట్టి చేశా. మా మూవీ రిలీజ్‌కు ఈ సీతాకాలం సరైన సమయం అని ఇప్పుడు విడుదల చేస్తున్నాం. తమన్నా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని తెలియగానే షాకయ్యా. ఆమె ఇందులో నిధి అనే పాత్రలో కనిపిస్తారు. ఇది కన్నడ మూవీకి రీమేక్‌ అయినా.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మంచి మార్పులు చేశాం. లవ్ స్టోరీస్ యూనివర్సల్ కదా! అవి ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ మధ్య వచ్చిన ‘సీతారామం’, ‘లవ్‌టుడే’ వంటి సినిమాలను ఆదరించినట్లే.. మా చిత్రాన్నీ ఆదరిస్తారని నమ్ముతున్నా’ అని సత్యదేవ్ పేర్కొన్నారు. 

Read more: Tollywood : వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా సత్తాచాటుతున్న టాలీవుడ్ స్టార్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!