God Father: 'గాడ్ ఫాదర్' సినిమాను డబ్బు కోసం నిర్మించలేదు - చిరంజీవి(Chiranjeevi)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'గాడ్ ఫాదర్' మీడియా మీట్‌లో పలు ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. దసరా కానుకగా రిలీజ్ అవుతున్న 'గాడ్ ఫాదర్' సినిమా.. అమ్మవారి దయతో సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. తాము పడిన కష్టానికి ప్రతి ఫలం ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. 'గాడ్ ఫాదర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 5 తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించారు.
గాడ్ ఫాదర్ హిట్ అవుతుంది - చిరు
"లూసిఫర్ సినిమాను చూశారా" అని రామ్ చరణ్ చిరంజీవిని అడిగారట. రామ్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ చిరంజీవి 'లూసిఫర్' సినిమాను చాలా సార్లు చూశానని చెప్పారట. 'లూసిఫర్' సినిమాలో పలు మార్పులు చేస్తే బాగుంటుందని చిరంజీవి భావించారట. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారట.
'గాడ్ ఫాదర్' (God Father) సినిమాను మోహన్ రాజా అద్భుతంగా చిత్రీకరించారని చిరు ఇటీవలే తెలిపారు. ఈ సినిమాలో కమర్షియల్ హంగులు లేకున్నా, స్టోరి లైన్ సాగే విధానం అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. 'గాడ్ ఫాదర్' సినిమా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ - చిరంజీవి
'గాడ్ ఫాదర్' సినిమాను బిజినెస్ కోసం తెరకెక్కించలేదని చిరంజీవి తెలిపారు. ఈ సినిమాను డబ్బు కోసం కాకుండా, తన తృప్తి కోసం నిర్మించారన్నారు. తమన్ కూడా 'గాడ్ ఫాదర్' సినిమా కోసం ఎంతో శ్రమించారన్నారు. ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు ప్రతీ ఒక్కరు చాలా కష్టపడ్డారన్నారు. 'గాడ్ ఫాదర్' సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.
'గాడ్‌ఫాదర్' సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారట. అలాగే నయనతార కూడా మరో పాత్ర పోషిస్తున్నారు. ఇక నటుడు సత్యదేవ్ కూడా ఆసక్తికరమైన రోల్‌లో కనిపించారు. ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో ఓ జర్నలిస్టు పాత్రలో నటించారట. చిరంజీవి స్వయంగా ఈ సినిమాలోని పూరీ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను గురించి కామెంట్ చేశారు. పూరీ మొదట ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకోలేదట. కానీ చిరంజీవి అడగటంతో కాదనలేకపోయారట.
Read more: God Father: 'గాడ్ ఫాదర్' సీక్వెల్‌కు రెడీ అంటున్న దర్శకుడు మోహన్ రాజా