మరో రీమేక్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా! డైరెక్టర్‌‌ను కూడా ఓకే చేశారా?

Updated on Oct 07, 2022 12:07 AM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రీమేక్‌ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  మరో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రీమేక్‌ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా రెడీగా ఉంది. విజయ దశమి సందర్భంగా అక్టోబర్‌‌ 5వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ప్రస్తుతం మెగా154 సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు చిరు. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈ సినిమా తర్వాత భోళాశంకర్ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. అనంతరం వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకున్నారు చిరంజీవి. అయితే ఆ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది.

మలయాళ స్టార్  మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన సినిమా లూసిఫర్. ఈ సినిమాకు రీమేక్‌గానే గాడ్‌ఫాదర్ సినిమా తెరకెక్కింది. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, మురళీశర్మ, సునీల్, బ్రహ్మాజీ, పూరీ జగన్నాథ్‌ కీలకపాత్రల్లో నటించారు. భోళాశంకర్‌‌ సినిమా కూడా కోలీవుడ్‌ సినిమాకు రీమేక్‌గానే తెరకెక్కుతోంది.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రీమేక్‌ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  మరో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్

ఫ్లాప్ సినిమా తీసినా.. నమ్మకంతో..

ఇక ఈ సినిమాల తర్వాత చిరంజీవి (Chiranjeevi) మరో రీమేక్ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. థ్రిల్లర్‌‌ కథాంశంతో తెరకెక్కిన స్పానిష్ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నారనట చిరు. ఇటీవలే ఆ సినిమాను చూసిన మెగాస్టార్.. తన ఇమేజ్‌కు ఈ కథ బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం. మాజీ డాన్‌ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథాంశంతో థ్రిల్లింగ్‌గా సినిమా ఉంటుందని టాక్. ఈ రీమేక్ సినిమాను తెరకెక్కించే బాధ్యతను ప్రభుదేవాకు అప్పగించాలని కూడా నిర్ణయించారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయిన ప్రభుదేవా అయితే ఈ కథకు న్యాయం చేస్తారని అనుకుంటున్నారని సమాచారం.  అయితే ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి ఇప్పటికే ‘శంకర్‌‌దాదా జిందాబాద్’ సినిమా చేశారు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయినప్పటికీ ప్రభుదేవా మీద ఉన్న నమ్మకంతో డైరెక్షన్ బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. ఈసారైనా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో ప్రభుదేవా సూపర్‌‌హిట్‌ కొడతారా లేదా చూడాలి మరి. ఈ సినిమాకు కథ రెడీ చేయడానికి ప్రభుదేవా పని కూడా మొదలుపెట్టారని టాక్.

Read More : ప్రతి అభిమానీ గాడ్‌ఫాదరే.. నా వెనుక లక్షల మంది గాడ్‌ఫాదర్స్ ఉన్నారు: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!