‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) నుంచి రవితేజ (Raviteja Teaser) ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్.. పూనకాలు లోడింగ్!

Updated on Dec 12, 2022 12:22 PM IST
మాస్ మహారాజా రవితేజ (Raviteja) నట విశ్వరూపం ను చూడవచ్చు. డైరెక్టర్ బాబీ రవితేజ పాత్రను ఈ చిత్రం లో చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
మాస్ మహారాజా రవితేజ (Raviteja) నట విశ్వరూపం ను చూడవచ్చు. డైరెక్టర్ బాబీ రవితేజ పాత్రను ఈ చిత్రం లో చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ (Shruti Haasan), కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్ లో చిరు సరసన ఆడిపాడింది. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని ప్రకటించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. చిరంజీవి, రవితేజ.. అన్న, తమ్ముడు పాత్రల్లో కనిపించబోతున్నారని సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్. మరి ఈ పాత్రలను డైరెక్టర్ బాబీ ఎలా డిజైన్ చేశారనే విషయంలో అందరిలో అంచనాలను పెంచేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే చిరంజీవి (Megastar Chiranjeevi) లుక్ కి సంబంధించిన లుక్ ను మేకర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ కి సంబంధించిన అప్డేట్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు చిత్ర యూనిట్ అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రవితేజ ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ వీడియో లో మాస్ మహారాజా రవితేజ (Raviteja) నట విశ్వరూపం ను చూడవచ్చు. డైరెక్టర్ బాబీ రవితేజ పాత్రను ఈ చిత్రం లో చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ‘ఫస్ట్ టైం ఒక మేకపిల్ల ను పులి ఎత్తుకొని వస్తున్నట్లు ఉన్నాది’ అనే డైలాగ్ తో రవితేజ ను పవర్ ఫుల్ గా చూపించారు. వీడియో లో రవితేజ మాస్ డైలాగ్స్ కి రాక్ స్టార్ డిఎస్పీ దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. రవితేజ లుక్, తెలంగాణా యాస, బాబీ మాస్ ఎలివేషన్స్ అన్నీ ఓ రేంజ్ లో హైలెట్ అయ్యాయి అని చెప్పాలి. 

Read More: చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు గుడ్ న్యూస్.. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) రిలీజ్ డేట్ ఫిక్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!