ప్రతి అభిమానీ గాడ్‌ఫాదరే.. నా వెనుక లక్షల మంది గాడ్‌ఫాదర్స్ ఉన్నారు: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

Updated on Sep 29, 2022 09:33 AM IST
అనంతపురంలో జరిగిన గాడ్‌ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వర్షంలో తడుస్తూనే అభిమానులతో మాట్లాడుతున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)
అనంతపురంలో జరిగిన గాడ్‌ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వర్షంలో తడుస్తూనే అభిమానులతో మాట్లాడుతున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన సినిమా గాడ్‌ఫాదర్. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌ లుక్, టీజర్, పాటలు సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. అంతేకాదు, గాడ్‌ఫాదర్‌‌ సినిమాలో చిరంజీవి గెటప్‌ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రాజకీయ నేపథ్యంలో నడిచే పవర్‌‌ఫుల్ కథ కావడంతో చిరంజీవి యాక్షన్, డైలాగ్స్, లుక్స్‌ కొత్తగా ఉన్నాయి.

విజయ దశమి కానుకగా గాడ్‌ఫాదర్ సినిమా విడుదల కానుంది. అక్టోబర్‌‌ 5వ తేదీన సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే గాడ్‌ఫాదర్ సినిమాలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ డాన్స్ చేసిన పాటను విడుదల చేశారు. తార్‌‌మార్‌‌ తక్కర్‌‌మార్ అంటూ సాగే ఈ పాటలో మెగాస్టార్ చిరు, సల్మాన్ వేసిన స్టెప్స్‌ మెగా అభిమానులను ఉర్రూతలూగించాయి. ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది.

అనంతపురంలో జరిగిన గాడ్‌ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వర్షంలో తడుస్తూనే అభిమానులతో మాట్లాడుతున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

వర్షంలో తడుస్తూనే..

ఇక, ఇటీవల మరో పాటను విడుదల చేశారు మేకర్స్. నజభజ జజర అంటూ సాగే ఈ పాటకి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అంతేకాదు, టీజర్‌‌, చిరు ఫస్ట్‌ లుక్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. గాడ్‌ఫాదర్ సినిమా కొద్దిరోజుల్లో విడుదలవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది.  అనంతపురంలో జరిగిన ఈవెంట్‌లో చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ఈవెంట్‌లో చిరంజీవి తడుస్తూనే అభిమానులతో మాట్లాడారు.

అనంతపురంలో జరిగిన గాడ్‌ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వర్షంలో తడుస్తూనే అభిమానులతో మాట్లాడుతున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

విపరీతంగా వర్షం కురుస్తున్నా కూడా అభిమానులు అక్కడి నుంచి కదలకపోవడం గురించి చిరంజీవి స్పందించారు. జోరుగా వర్షం పడుతున్నా తన మీద అభిమానంతో తడుస్తూ నిలుచున్న ఫ్యాన్స్‌కు చిరు థాంక్స్ చెప్పారు. ‘‘గాడ్‌ఫాదర్‌ అని మీరు నన్ను అంటున్నారు. కానీ ఏ గాడ్‌ఫాదర్స్ లేకుండా వచ్చిన నాకు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి, ఆ పరిస్థితి, ఆ స్థితి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అభిమాని కూడా నాకు గాడ్‌ఫాదర్. నా అభిమానులే నాకు గాడ్‌ఫాదర్స్. అంటారు చిరంజీవికి వెనకాల ఏ గాడ్‌ఫాదర్స్‌ లేరని.. ఇప్పుడు అంటున్నాను.. నా వెనకాల లక్షలాది మంది గాడ్‌ఫాదర్స్‌ ఉన్నారు” అని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).

Read More : ‘గాడ్‌ఫాదర్‌‌’ (GodFather) సినిమా ఒక నిశ్శబ్ద విస్ఫోటనం: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

అనంతపురంలో జరిగిన గాడ్‌ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వర్షంలో తడుస్తూనే అభిమానులతో మాట్లాడుతున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

అనంతపురంలో జరిగిన గాడ్‌ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వర్షంలో తడుస్తూనే అభిమానులతో మాట్లాడుతున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!