Ravi Teja: సూట్ కేసు పట్టుకుని స్టైలిష్‌గా మాస్ మహారాజా!.. ‘వాల్తేరు వీరయ్య’ నుంచి రవితేజ ఫస్ట్ లుక్ రిలీజ్

Updated on Dec 09, 2022 05:25 PM IST
చేతిలో సూట్ కేసు పట్టుకుని స్టైలిష్‌గా నడుస్తున్న మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఫస్ట్ లుక్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది 
చేతిలో సూట్ కేసు పట్టుకుని స్టైలిష్‌గా నడుస్తున్న మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఫస్ట్ లుక్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది 

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)కు ఈతరం ఆడియెన్స్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. హుషారైన డైలాగులు, మాస్ డ్యాన్సులు, కామెడీ టైమింగ్‌తో యువతలో ఆయన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. సరైన హిట్స్ లేక సమతమవుతున్న సమయంలో ‘క్రాక్’ చిత్రంతో ఆయన బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘డిస్కో రాజా’ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. దీంతో మరింత జోష్‌తో ఆయన పని చేస్తున్నారు. 

ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ‘ధమాకా’. డిసెంబర్ 23న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ తీయడంలో దిట్టగా చెప్పుకునే త్రినాథరావు నక్కిన ‘ధమాకా’ను తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లోనూ రవితేజ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ లుక్ ఇవాళ రిలీజైంది. 

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రంలో రవితేజ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. చేతిలో సూట్ కేసు పట్టుకుని స్టైలిష్‌గా నడుస్తున్న రవితేజను ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూడొచ్చు. ఈ పోస్టర్‌ను మాస్ మహారాజా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆడియెన్స్‌తో పంచుకున్నారు. ఈ లుక్ సినిమాలో ఆయన పాత్ర ఓ రేంజ్‌లో ఉంటుందనే ఆసక్తిని పెంచేలా ఉంది. మరి, ‘వాల్తేరు వీరయ్య’తో తన ఫ్యాన్స్, చిరు అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకులను కూడా రవితేజ ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తారేమో చూడాలి.  

ఇకపోతే, సంక్రాంతి రేసులో ‘వాల్తేరు వీరయ్య’తో పాటు మరికొన్ని చిత్రాలు కూడా ఉండటంతో థియేటర్ల సమస్య తప్పేలా లేదు. నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ పండుగకే రిలీజ్ కానుంది. తమిళ స్టార్ హీరోలు విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తునివు’ కూడా పొంగల్ బరిలోకి తమ సినిమాలను నిలుపుతున్నారు. ‘వీరసింహారెడ్డి’, ‘వారసుడు’ చిత్రాలు ఒకేరోజు (జనవరి 12)న విడుదల కానున్నాయి. మరి, ఈ పోటీలో ఏయే చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను పొందుతాయో చూడాలి. 

Read more: Movie Review : యాక్షన్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌‌టైనర్‌‌ ‘చెప్పాలని ఉంది’ సినిమా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!