వైజాగ్ లో ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రైన్?

Updated on Dec 14, 2022 05:50 PM IST
‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Waltair Veerayya Pre Release Event) కోసం చిత్ర అదిరిపోయే ప్లాన్స్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Waltair Veerayya Pre Release Event) కోసం చిత్ర అదిరిపోయే ప్లాన్స్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), శృతి హాసన్ (Shruti Haasan) జంటగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). మాస్ మహారాజ రవితేజ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో ఈ ఫస్ట్ లుక్ విడుదలైంది.

ఇక, ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్‌ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ‘డీజే వీరయ్య’ అంటూ చిరంజీవి  స్క్రీన్ మీద వేసే స్టెప్స్ చూసే మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్డేట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 

‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Waltair Veerayya Pre Release Event) కోసం చిత్ర అదిరిపోయే ప్లాన్స్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 13న ఈ విడుదల కాబోతుండడంతో జనవరి 8న విశాఖపట్నంలో ఈ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నారట. 

మరోవైపు.. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుండి రావాలనుకుంటున్న మెగా అభిమానుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వైజాగ్‌కి స్పెషల్ ట్రైన్స్ (ఒకటి లేదా రెండు) వేయనున్నారని.. దీని కోసం నిర్మాతలు ఇప్పటినుండే సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 

వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రానికి  రాక్ స్టార్  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా... సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా.. కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

Read More: ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) నుంచి రవితేజ (Raviteja Teaser) ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్.. పూనకాలు లోడింగ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!