Prabhas: ప్రభాస్ @ 20 ఇయర్స్ ఇండస్ట్రీ .."డార్లింగ్" కెరీర్‌ను మలుపు తిప్పిన 'వర్షం' చిత్రం టాప్ 10 విశేషాలు

Updated on Nov 12, 2022 05:45 PM IST
ప్రభాస్ (Prabhas) 20 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ వర్షం సినిమాను మళ్లీ రిలీజ్ చేశారు నిర్మాతలు.
ప్రభాస్ (Prabhas) 20 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ వర్షం సినిమాను మళ్లీ రిలీజ్ చేశారు నిర్మాతలు.

ప్రభాస్ (Prabhas) ..  ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్. బాహుబలి, సాహో, రాధే శ్యామ్ చిత్రాలతో బాలీవుడ్  ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన కథానాయకుడు. ఆలిండియా లెవల్‌లో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యంగ్ రెబల్ స్టార్‌గా, డార్లింగ్‌గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రభాస్  సినీ పరిశ్రమకు వచ్చి నేటితో 20 ఏళ్లు పూర్తయ్యింది. ఆయన నటించిన తొలి చిత్రం 'ఈశ్వర్' ఈ రోజే రిలీజైంది.

ఈ సందర్భంగా, ప్రభాస్ అభిమానులకు ఓ తియ్యటి కబురును అందించారు ఆయన సన్నిహితులు. ఆయన నటించిన 'వర్షం' చిత్రాన్ని మళ్ళీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 4K  టెక్నాలజీతో ఈ సినిమా రిలీజ్ కానుంది. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కు 'వర్షం' సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చింది.  ఆ రోజుల్లోనే యాక్షన్ ఓరియంటెడ్ లవ్ స్టోరీస్‌లో 'వర్షం' చిత్రం కొత్త ట్రెండ్‌ను సృష్టించింది.  హీరో గోపిచంద్ విలన్‌గా నటించిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను తిరగరాసింది. ప్రభాస్ 20 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ.. ఈ రోజు 'వర్షం' సినిమాను రీ రిలీజ్ చేశారు.  ఈ సినిమా గురించిన టాప్ 10 ఆసక్తికర విశేషాలు పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం ప్రత్యేకం..!

ప్రభాస్  (Prabhas) 20 ఏళ్ల సినీ ప్రస్థానం గుర్తుచేసుకుంటూ వర్షం సినిమాను రీ రిలీజ్ చేశారు.

వర్షం సినిమా టాప్ 10 ఆసక్తికర విశేషాలు

* 2004లో 'వర్షం' సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా అందాల తార త్రిష నటించారు. 

* 'వర్షం' సినిమాతో ప్రభాస్  (Prabhas) స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతేకాదు, ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రంగా కూడా ఈ సినిమా ఫిల్మ్ హిస్టరీలో నిలిచిపోయింది

* 'వర్షం' చిత్రాన్ని రొమాంటిక్ యాక్షన్ సినిమాగా దర్శకుడు శోభన్ తెరకెక్కించారు. సింధూరం, క్షణ క్షణం సినిమాలకు రచయితగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభన్.. 'వర్షం' సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 

* ఈ సినిమాలో నటుడు గోపిచంద్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. అంతకు ముందే ఆయన జయం, నిజం చిత్రాలలో విలన్‌గా చేశారు. తర్వాత హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. 

* 'వర్షం' సినిమా పాటలు అప్పట్లో శ్రోతలను అమితంగా అలరించాయి. ముఖ్యంగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' పాటలో గాయని చిత్ర పలికించిన స్వరాలకు ఫ్యాన్ ఫిదా అయిపోయారు. అలాగే 'నైజాం పోరీ' పాటను బాలీవుడ్ నటుడు అద్నాన్ సమీ పాడారు. 'కోపమా నాపైనా' పాటను ప్రఖ్యాత గాయని శ్రేయా ఘోషాల్ పాడారు. ఈ సినిమా పాటలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ రాశారు. 

* సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఎం.ఎస్.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. ఇక గాలి గన్నారావు పాత్రలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ ఆకట్టుకుంటుంది. 

* వర్షం చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా  ఆ రోజులలోనే దాదాపు రూ.18 కోట్లను రాబట్టింది.

* ఉత్తమ నటుడు కేటగిరిలో  'వర్షం' సినిమాకుగానూ ప్రభాస్ (Prabhas) ఫిలిమ్‌ఫేర్‌కు నామినేట్ అయ్యారు. అలాగే త్రిష  కూడా ఉత్తమ నటిగా ఫిలిమ్‌ఫేర్ అందుకున్నారు. ఇక ఉత్తమ విలన్‌‌గా గోపిచంద్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా గోపాల్ రెడ్డి, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా చిత్ర ఫిలిమ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు.

* ఈ సినిమా మూడు నంది అవార్డులను కూడా గెలుచుకుంది. చిత్ర ఉత్తమ గాయనిగా, ప్రభుదేవా ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా, అలాగే మధుసూదన్ రెడ్డి ఉత్తమ ఆడియోగ్రాఫర్‌గా అవార్డులు అందుకున్నారు.

 *  ఈ సినిమా 125 కేంద్రాలలో అర్థ శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. అలాగే 79 సెంటర్లలో శత దినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. అలాగే ఈ సినిమా 175 రోజుల ఉత్సవానికి, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

* వర్షం సినిమాను తమిళ్, ఒరియా, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. ఆ చిత్రాలు కూడా ఆయా రాష్ట్రాలలో కాసుల వర్షం కురిపించాయి. 

Read More: Happy Birthday Prabhas : యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా సాగిన డార్లింగ్ సినీ ప్రయాణం !

ప్రభాస్  (Prabhas) 20 సినీ ప్రస్థానం గుర్తుచేసుకుంటూ వర్షం సినిమాను రీ రిలీజ్ చేశారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!