'సలార్' (Salaar) నుంచి క్రేజీ అప్డేట్.. యాంగ్రీ లుక్ లో పృథ్వీ రాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) పోస్టర్!

Updated on Oct 16, 2022 02:32 PM IST
మళయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ని ఈ సినిమాలో కన్ఫర్మ్ చేస్తూ క్రేజీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
మళయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ని ఈ సినిమాలో కన్ఫర్మ్ చేస్తూ క్రేజీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో.. 'కేజిఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “సలార్” (Salaar). బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తోంది. 'కేజీఎఫ్' వంటి సంచలన విజయాల తరువాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం నుంచి నుంచి ఈ రోజు మేకర్స్ ఓ సాలిడ్ అనౌన్సమెంట్ ని అందిస్తున్నట్టు తెలిపారు. మళయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ని ఈ సినిమాలో కన్ఫర్మ్ చేస్తూ షాకింగ్ అండ్ క్రేజీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది. ఇందులో ఆయన.. వరదరాజ మన్నార్ పాత్రలో యాంగ్రీ లుక్ లో కనిపించారు. ఓ ఐకానిక్ క్రూరమైన రోల్ డిజైన్ చేసినట్టు క్లియర్ గా కనిపిస్తోంది. తన బొట్టు, ముక్కు, చెవులు, మెడలో రింగులు అన్నీ చూస్తుంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది.

అప్పట్లో ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటిస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే తన డేట్స్ సమస్య వల్ల తాను నటించడం లేదని ఆ మధ్య ఆయనే స్వయంగా ప్రకటించాడు. కానీ కరోనా కారణంగా 'సలార్' (Salaar) ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో పృథ్వీరాజ్ సుకుమారన్ మళ్లీ ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. 

బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ (Prabahs) రఫ్ లుక్ లో కనిపించనున్నారు. శ్రుతిహాసన్ (Shruti Haasan), జగపతి బాబు తదితరులు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 60శాతం షూటింగ్ పూర్తి అయిందని సమాచారం. 

Read More: ప్రభాస్ (Prabhas) బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 4K క్వాలిటీలో ‘బిల్లా’ (Billa Movie) రీరిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!