Top 10 Fittest Tollywood Actors - ఫిటినెస్ విషయంలో తగ్గేదేలే అంటున్న తెలుగు హీరోలపై ప్రత్యేక కథనం..
Fittest Tollywood Actors: టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు తమ బాడీ ఫిట్ నెస్ కోసం చాలా కష్టపడుతుంటారు. వెండితెరపై హీరోలు నటనతోనే కాకుండా సిక్స్ ప్యాక్‌లతో కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటారు. సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించాలంటే అంత తేలికైన విషయం కాదు. అందుకోసం గంటల తరబడి వర్క్ అవుట్స్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సినిమాలోనూ ఒకేలా కాకుండా.. ఒక్కో సినిమాకు ఒక్కో లుక్‌లో కనిపించాలని హారోలు ప్రయత్నిస్తుంటారు. బాడీ ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తున్న టాప్ 10 టాలీవుడ్ హీరోలపై పింక్ విల్లా ప్రత్యేక కథనం..
మహేష్ బాబు
'సర్కారు వారి పాట' సినిమా తరువాత మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. SSMB28లో మహేష్ బాబు కొత్త లుక్‌లో కనిపించనున్నారు. అందుకోసం మహేష్ బాబు జిమ్‌లో వర్క్ అవుట్స్ చేస్తున్నారు.
ఇటీవల మహేష్ బాబు వర్క్ అవుట్స్ చేస్తున్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. మహేష్ స్విమ్ చేస్తున్న ఫోటోలు అతని భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ మహేష్ లుక్ చూసి ఫిదా అయిపోయారు.
మహేష్ బాబు సినిమాల్లోకి రాకముందు కాస్త బొద్దుగా ఉండేవారు. 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా మారిన మహేష్ తన లుక్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. రోజు రోజుకు యంగ్‌గా కనిపిస్తున్న మహేష్ బాబు... ప్రతి రోజు తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు. మంచి డైట్ తీసుకుంటారు.
ప్రభాస్ (Prabhas)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పర్సనాలిటీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. హీరోయిజానికి తగ్గట్టుగా తన పర్సనాలిటీ మెయింటెన్ చేస్తారు డార్లింగ్. ప్రతి రోజూ కచ్చితంగా గంట పాటు ప్రభాస్ ఎక్సర్‌సైజ్ చేస్తారట. బాడీ ఫిట్‌గా ఉంచే స్క్వాట్స్, వాకింగ్ లంజెస్ వంటి ఎక్సర్‌సైజులు చేస్తుంటారు. 'ఆదిపురుష్', 'సాలార్', 'ప్రాజెక్ట్ కె' సినిమాల్లో ఒక్కో లుక్‌లో కనిపించనున్నారట ప్రభాస్.
రామ్ చరణ్
'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారారు రామ్ చరణ్. పాన్ ఇండియా హీరో అంటే ఓ రేంజ్‌లో బాడీ ఫిటినెస్ ఉండాలి. రీసెంట్‌గా రామ్ చరణ్ వర్క్ అవుట్ వీడియో చూస్తే.. ఈ యంగ్ హీరో ఫిట్ నెస్ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది.
ప్రస్తుతం దర్శకుడు శంకర్ సినిమా కోసం రామ్ చరణ్ తన బాడీ షేపింగ్‌పై ఫోకస్ పెంచారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో సిక్స్ ప్యాక్‌తో అదరగొట్టిన రామ్.. తన నెక్ట్స్ సినిమాలో మరింత ఎట్రాక్టీవ్ లుక్‌లో కనిపించడానికి రిస్కీ వర్క్ అవుట్స్ కూడా చేసేస్తున్నారు.
ఎన్టీఆర్
సినిమాలు చేస్తున్న కొత్తలో ఎన్టీఆర్ ఫిట్ నెస్ విషయం అంత పట్టించుకునే వారు కాదు. 'యమదొంగ' సినిమా నుంచి ఎన్టీఆర్ తన బాడీ రూపురేఖలే మార్చేశారు. సిక్స్ ప్యాక్‌తో ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఇటీవల విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎన్టీఆర్ ఫిజిక్ ఓ రేంజ్‌లో ఉంది. పులిని బంధించే సన్నివేశంలో ఎన్టీఆర్ అదిరిపోయారు. ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాలను దర్శకులు ప్రశాంత్ నీల్, కొరటాల శివలతో చేస్తున్నారు. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ లుక్ ఓ రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు.
అల్లు అర్జున్
అల్లు అర్జున్ మొదటి నుంచి బాడీ ఫిటినెస్‌పై ఫోకస్ పెట్టారు. ఒక్కో సినిమాలో ఒక్కోలా బన్ని కనిపిస్తుంటారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ పాన్ ఇండియా లెవల్‌లో ఫేమస్ అయింది.
పుష్ప సినిమా కోసం కండల తిరిగిన బాడీని రెండేళ్ల నుంచి మెయింటెన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రతి రోజూ ఉదయం దాదాపు 45 నిమిషాల పాటు ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తారట. పుష్ప 2లో అల్లు అర్జున్ లుక్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
నాగార్జున
60 ఏళ్లు దాటిన నాగార్జున తన బాడీ ఫిట్ నెస్ కోసం మరీ ఎక్కువ కష్టపడరట. రోజూ ఓ గంట పాటు జిమ్ చేస్తారు నాగ్. కనీసం 8 గంటలు నిద్రపోతారు. లైట్ ఫుడ్ తీసుకుంటారు. డైటింగ్ చేయరు కానీ.. వారంలో ఆరు రోజులు ఎక్సర్‌సైజులు చేయాల్సిందేనట. నాగార్జునను టాలీవుడ్ మన్మథుడని ఎందుకంటారో ఇప్పడు అర్థమైందా!
విజయ్ దేవరకొండ
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫిట్ నెస్ బాడీ కోసం ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటారు. ఇటీవల రిలీజ్ అయిన లైగర్ సినిమాలో ఫైటర్ బాడీ షేప్ కోసం విజయ్ దాదాపు 2 ఏళ్లు శిక్షణ తీసుకున్నారట. గ్రేట్ ఫైటర్ మైక్ టైసన్ పక్కన యాక్ట్ చేయాలని విజయ్ కూడా ఫైటర్ లుక్ కోసం చాలా కష్టపడ్డారట.
సుధీర్ బాబు
సుధీర్ బాబు బాడీ ఫిట్ నెస్ కోసం చాలా కష్టపడుతుంటారు. కఠినమైన కసరత్తులు చేస్తూ ఎప్పటికప్పుడు తన బాడీని పర్ఫెక్ట్ షేప్‌లో పెడుతుంటారు. సుధీర్ బాబు తన సినిమాల్లో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. సిక్స్ ప్యాక్‌లో కనిపించే సుధీర్ బాబు చాలా మందికి రోల్ మోడల్ అట. ఫిట్ నెస్ సీక్రేట్స్ చెప్పమని పలువురు హీరోలు సుధీర్ బాబును అడుగుతుంటారట. జిమ్ చేస్తుండటంతో పాటు కొత్త కొత్త ఎక్సర్‌సైజులు చేస్తుంటారు సుధీర్ బాబు.
రానా దగ్గుబాటి
హీరోలలో రానా దగ్గుబాటి ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకంటే హీరో పాత్రలలో పాటు విలన్ పాత్రల్లోనూ రానా నటించి మెప్పిస్తుంటారు. బాహుబలిలో రానా బాడీ ఫిట్ నెస్ అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాల్లో లుక్ కోసం తన ఆహారం, తన వర్క్ అవుట్స్‌ను ప్లాన్ చేసుకుంటారు రానా.
అఖిల్ అక్కినేని
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని వర్క్ అవుట్స్ విషయంలో అసలు తగ్గరట. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ ఎక్కువ టైమ్ జిమ్‌లో కష్టమైన వర్క్ అవుట్స్ చేస్తున్నారట. అఖిల్ ఎంతో కష్టపడి తన బాడీని బీస్ట్ లుక్‌లోకి మార్చేశారు.
Read More: Tollywood: ఈ ఏడాది రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం..