Happy Birthday Prabhas : యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా సాగిన డార్లింగ్ సినీ ప్రయాణం !

Updated on Oct 23, 2022 11:30 AM IST
ప్రభాస్ (Prabhas) తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. 
ప్రభాస్ (Prabhas) తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. 

మన టాలీవుడ్ హీరోలలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. ఆరడుగులకు మించిన ఎత్తు.. అందం.. అభినయం.. మర్యాద.. మంచితనం ఇవన్నీ మెండుగా ఉన్న నటుడు ప్రభాస్ (Prabhas).

'బాహుబలి ది బిగినింగ్', 'బాహుబలి ది కంక్లూజన్' సినిమాల తరువాత ప్రభాస్ స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. 

ప్రస్తుతం 'ఆదిపురుష్' చిత్రంతో పాన్ వరల్డ్ స్టార్‌గా మారేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా పింక్ విల్లా స్పెషల్ స్టోరి.

ప్రభాస్ (Prabhas) తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. 

సినీ జగత్తులో నా వారసుడు ప్రభాస్ : కృష్ణంరాజు
ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. వీరి తండ్రి పేరు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, తల్లి శివ కుమారి. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజు ప్రముఖ నటుడు కృష్ణంరాజుకు సోదరుడు. అంతేకాదు సూర్యనారాయణరాజు నిర్మాతగా పలు సినిమాలను నిర్మించారు. ప్రభాస్ తల్లిగారు కూడా కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 

సినీ జగత్తులో తన వారసుడు ప్రభాస్ అని కృష్ణంరాజు గతంలో అనేక ఇంటర్వ్యూలలో తెలిపారు. ప్రభాస్ 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించారు. వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. ప్రభాస్ సోదరుడు ప్రబోధ్, చెల్లెలు ప్రగతి.

ప్రభాస్ (Prabhas) తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. 

చదువు
ప్రభాస్ (Prabhas) పదవ తరగతి వరకు భీమవరంలోని డి.ఎన్.ఆర్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌లో తన చదువును కొనసాగించారు. ప్రభాస్‌కు నటనపై ఆసక్తి ఉండడంతో విశాఖపట్నంలోని సత్యానంద్ ఫిలిమ్ ఇనిస్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సును పూర్తి చేశారు.

స్నేహితులు
ప్రభాస్ స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి.  హీరోలు గోపిచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్, అనుష్క‌లు ప్రభాస్‌కు మంచి స్నేహితులు.

ప్రభాస్ (Prabhas) తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. 

మొదటి సినిమా 'ఈశ్వర్' హిట్
2002 సంవత్సరంలో 'ఈశ్వర్' సినిమాతో ప్రభాస్ తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే ప్రభాస్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత ప్రభాస్ నటించిన చిత్రం 'రాఘవేంద్ర'. ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. 

ప్రభాస్ నటించిన మూడో సినిమా 'వర్షం'. 2004లో విడుదలైన వర్షం ప్రభాస్ రేంజ్‌ను ఒక్కసారిగా మార్చేసింది. 'వర్షం' సినిమాలో త్రిష, ప్రభాస్ జంటగా నటించారు. గోపిచంద్ విలన్ పాత్రలో కనిపించారు. వర్షం 2004 సంవత్సరంలో అతి పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. 

ప్రభాస్ (Prabhas) తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. 

'ఛత్రపతి'తో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన 'డార్లింగ్'
ప్రభాస్  (Prabhas) నటించిన అడవి రాముడు, చక్రం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా సందడి చేయలేకపోయాయి. 2005లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన 'ఛత్రపతి' ప్రభాస్‌కు సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. 

ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్ సీన్లలో ప్రభాస్ కనబరిచిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతగా ఆ భావోద్వేగ సన్నివేశాలలో తన నటనా పటిమతో ఆకట్టుకున్నారాయన. అంతేకాదు ప్రభాస్ 'ఛత్రపతి' సినిమాలో చేసిన యాక్షన్ ఫీట్లు థియేటర్లను షేక్ చేశాయి.

ప్రభాస్ (Prabhas) తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. 

'బుజ్జిగాడు'లో కొత్త పాత్రలో..
2006లో విడుదలైన 'పౌర్ణమి', 2007లో రిలీజ్ అయిన 'యోగి' సినిమాలు పరాజయం చెందాయి. అయితే పైడిపల్లి వంశీ దర్శకత్వంలో విడుదలైన 'మున్నా' సినిమాతో ప్రభాస్ ఓ మోస్తరు విజయాన్ని అందకున్నారు. 

2008లో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో 'బుజ్జిగాడు'  సినిమాలో ప్రభాస్ నటించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిష నటించారు. ఈ సినిమా కూడా విజయం సాధించింది.

ప్రభాస్ (Prabhas) తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. 

'బిల్లా'లో డాన్‌గా యంగ్ రెబల్ స్టార్
2009లో బిల్లా సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో డాన్ పాత్రలో ప్రభాస్ అదరగొట్టారు. అనుష్క, నమితలతో కలసి నటించారు. 'బిల్లా' సినిమా ప్రభాస్‌కు స్టార్ హోదాను తీసుకొచ్చింది. ఆ తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన 'ఏక్ నిరంజన్' చిత్రం ప్రభాస్‌ను నిరాశ పరిచింది. 

2010 లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన 'డార్లింగ్' చిత్రం ప్రభాస్‌కు బ్లాక్ బాస్టర్ హిట్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించారు. 2011లో రిలీజ్ అయిన 'మిస్టర్ పర్‌ఫెక్ట్' కూడా ప్రభాస్‌కు భారీ హిట్ తెచ్చిపెట్టింది.

ప్రభాస్ (Prabhas) తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. 

మిర్చితో మారిన ప్రభాస్ లక్  
2012లో 'రాఘవ లారెన్స్' దర్శకత్వంలో విడుదలైన 'రెబల్'  అంతగా ఆడలేదు. ఆ తరువాత విడుదలైన 'మిర్చి' మాత్రం  ప్రభాస్ కెరియర్‌ను మార్చేసింది. 2013లో రిలీజ్ అయిన 'మిర్చి' చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనుష్క హీరోయిన్‌గా నటించారు. 

ప్రభాస్ (Prabhas) తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. 

'బాహుబలి'తో రికార్డులు తిరగరాస్తూ..
2013 సంవత్సరం ప్రభాస్‌కు బాగా కలిసి వచ్చింది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ 'బాహుబలి'గా ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టారు. 

బాహుబలిలో అనుష్క, రానా దగ్గుబాటి, తమన్నాలు నటించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. 'బాహుబలి' సీక్వెల్ కూడా ప్రభాస్‌కు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చింది.వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. 

2017లో విడుదలైన 'బాహుబలి 2' సినిమాతో ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియా స్టార్‌గా మారారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిమానులను సంపాదించుకున్నారు డార్లింగ్. అయితే బాహుబలి తరువాత ప్రభాస్‌కు అనుకున్నంత సక్సెస్ రాలేదన్నది నిజం. సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. 

ఈ భారీ బడ్జెట్ సినిమాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఈ సినిమాల తర్వాత, ప్రభాస్ నాలుగు సినిమాలలో నటిస్తూ బిజిగా ఉన్నారు. మళ్లీ గొప్ప సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే తపనతో ఎంతో శ్రమకోర్చి వాటి మీద వర్క్ చేస్తున్నారు . 

ప్రభాస్ (Prabhas) తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. 

'ఆదిపురుషుడి'గా ప్రభాస్
ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఇటీవలే విడుదైన టీజర్, ఫస్ట్ లుక్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాల్లో నటిస్తున్నారు.
 
ప్రభాస్ (Prabhas) తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. 

అవార్డులు
'వర్షం' సినిమాలో నటించిన ప్రభాస్ ఉత్తమ యువ నటుడుగా సంతోషం ఫిలిమ్ అవార్డును అందుకున్నారు. అలాగే 'సినీ మా' అవార్డులలో ఉత్తమ నటుడిగా జ్యూరీ అవార్డును 'డార్లింగ్' సినిమాకుగానూ ప్రభాస్ కైవసం చేసుకున్నారు. 2013 సంవత్సరంలో 'మిర్చి' సినిమాకుగానూ ఉత్తమ నటుడు కేటగిరిలో ప్రభాస్ నంది అవార్డును అందుకున్నారు. అలాగే 'బాహుబలి' సినిమాలో నటనకు కూడా ఉత్తమ నటుడిగా 'సంతోషం' అవార్డు అందుకున్నారు. 

Read More: ప్ర‌భాస్ (Prabhas) బ‌ర్త్‌డే స్పెష‌ల్.. 'ఆదిపురుష్' (Adipurush) కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌.. 3D,ఐమాక్స్ లో విడుదల!

ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ నటుడు కావాలని ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు ఎప్పుడూ అంటుండేవారు. ప్రభాస్ తన అద్భుత నటనతో ప్రేక్షకులకు మరింత వినోదం పంచాలని, మరిన్ని గొప్ప చిత్రాలు చేయాలని.. తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని పింక్ విల్లా కోరుకుంటుంది.  హ్యాపీ బర్త్ డే ప్రభాస్. 
పింక్ విల్లా
 
Advertisement
Credits: Wikipedia

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!