అందంతోనే కాదు విలనిజంతోనూ మెప్పించిన టాప్‌6 హీరోయిన్లు

Updated on Nov 29, 2022 05:03 PM IST
సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు హీరోయిన్లు
సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు హీరోయిన్లు

సినిమాల్లో హీరో క్యారెక్టర్‌‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ఇంపార్టెన్స్ విలన్‌కి కూడా ఉంటుంది. విలనిజం అనేది ఎంత పవర్‌‌ఫుల్‌గా ఉంటే హీరోయిజం అంతగా ఎలివేట్‌ అవుతుంది. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. గ్లామర్‌‌గా కనిపించడం ఎంత ముఖ్యమో కొత్త క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో స్టార్ హీరోయిన్లు కూడా అతీతులు కాదు. అందుకే గ్లామర్ పాత్రలతోపాటు అప్పుడప్పుడూ ప్రయోగాలు కూడా చేస్తుంటారు హీరోయిన్లు.

ఎప్పుడూ పాటలు, గ్లామర్‌‌తోనే కాకుండా విలనిజం కూడా ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు హీరోయిన్లు. తమ ఇమేజ్‌ను పక్కనపెట్టి నెగెటివ్ రోల్స్‌లో కనిపించిన స్టార్ హీరోయిన్ల గురించిన విశేషాలు పింక్‌విల్లా వ్యూయర్స్‌ కోసం ప్రత్యేకం..

సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు హీరోయిన్లు

రమ్యకృష్ణ (Ramya Krishna) :

సూపర్‌‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన సూపర్‌‌హిట్ సినిమా నరసింహ. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విజయంలో రజినీకాంత్‌ పాత్ర ఎంత ఉందో రమ్యకృష్ణ (Ramya Krishna) పాత్ర కూడా అంతేనని ఒప్పుకుని తీరాల్సిందే. అందులో ఏ మాత్రం సందేహం లేదు.

రజినీకాంత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయిన నీలాంబరి ఆయనపై పగ తీర్చుకోవడానికి ఎలా ప్రయత్నించింది. సినిమా మొదటి నుంచి నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌‌తో రమ్మకృష్ణ నటన ప్రేక్షకులను అలరించింది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమాలో కూడా రమ్యకృష్ణ నెగెటివ్ పాత్ర పోషించారు.

సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు హీరోయిన్లు

భాను ప్రియ (Bhanupriya) :

సూపర్‌‌స్టార్ కృష్ణ (Superstar Krishna) హీరోగా నటించిన ‘గూఢచారి 117’ సినిమాలో రెండు క్యారెక్టర్లను పోషించారు సీనియర్ హీరోయిన్ భానుప్రియ. రెండు క్యారెక్టర్లలో ఒకటి నెగెటివ్‌ క్యారెక్టర్. అనంతరం, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సూపర్‌‌హిట్ సినిమా ‘ఖైదా నంబర్‌‌ 786’ సినిమాలో కూడా నెగెటివ్‌ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌‌లో నటించి అలరించారు భాను ప్రియ.

సితార సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన భాను ప్రియ (Bhanupriya).. తెలుగతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల సినిమాల్లో కూడా నటించి మంచిపేరు తెచ్చుకున్నారు.

సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు హీరోయిన్లు

తమన్నా (Tamannaah) :

మంచు మనోజ్ (Manoj Manchu) హీరోగా తెరకెక్కిన సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు మిల్కీ బ్యూటీ తమన్నా. తర్వాత వచ్చిన హ్యాపీడేస్, 100%లవ్, బాహుబలి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితోనూ నటించారు తమన్నా ( Tamannaah). తన గ్లామర్, డాన్స్ యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యారు.

నితిన్ హీరోగా నటించిన మ్యాస్ట్రో సినిమాలో లేడీ విలన్‌గా నటించారు తమన్నా. ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేదు. అయినప్పటికీ తమన్నా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు హీరోయిన్లు

పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) :

యంగ్‌ హీరో కార్తికేయ (Karthikeya) నటించిన ఆర్‌‌ఎక్స్‌100 సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు పాయల్‌ రాజ్ పుత్. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయిన పాయల్.. నెగెటివ్ రోల్‌లో అలరించింది. కార్తికేయను ప్రేమించి మోసం చేసే పాత్రలో పాయల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఆర్‌‌ఎక్స్‌100 సినిమా సూపర్‌‌హిట్‌ కావడంలో పాయల్ రాజ్ పుత్‌ (Payal Rajput) పాత్ర కీలకంగా నిలిచింది.

సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు హీరోయిన్లు

రెజీనా కసాండ్రా (Regina Cassandra) :

శివ మనసులో శృతి (ఎస్‌ఎంఎస్) సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా వచ్చారు రెజీనా కసాండ్రా. గ్లామర్ పాత్రలతోపాటు కథలో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లు చేస్తూ తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యారు. కొంతకాలం వరకు సరైన సక్సెస్ అందకపోవడంతో సెకండ్ హీరోయిన్‌గా కూడా చేశారు రెజీనా.

తన అందం, నటనతో అభిమానులను సంపాదించుకున్న రెజీనా కసాండ్రా.. నెగెటివ్ క్యారెక్టర్లలోనూ అలరించారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘ఎవరు’ సినిమాలో విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు రెజీనా (Regina Cassandra). విశాల్ హీరోగా నటించిన చక్ర, హవీష్‌ ‘7’ సినిమాల్లో కూడా నెగెటివ్ రోల్స్‌ పోషించారు రెజీనా కసాండ్రా.

సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు హీరోయిన్లు

సౌందర్య (Soundarya) :

కన్నడ చిత్ర సీమ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన హీరోయిన్లలో ఒకరు సౌందర్య (Soundarya). మనుమరాలి పెళ్లి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సౌందర్య.. దాదాపు దశాబ్దంపాటు స్టార్ హీరోయిన్‌గా కొనసాగారు. అందరు స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. తన అందం, నటనతో టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు సౌందర్య.

శ్రీకాంత్ (Srikanth Meka) హీరోగా నటించిన ‘నా మనసిస్తా రా’ సినిమాలో విలన్‌గా నటించారు సౌందర్య. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది. స్టార్ హీరోయిన్‌ అయిన సౌందర్యను ఆమె అభిమానులు నెగెటివ్ రోల్‌లో చూడడానికి ఇష్టపడలేదని అందుకే సినిమా ఫ్లాప్ అయ్యిందని టాక్ వచ్చింది. 

సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు హీరోయిన్లు

ఇక, విక్రమ్ హీరోగా వచ్చిన ‘పత్తు ఎంద్రాకుల్లా’ సినిమాలో విలన్‌ పాత్రలో  మెప్పించారు సమంత (Samantha). ధనుష్ హీరోగా తెరకెక్కిన ధర్మయోగి సినిమాలో విలన్‌గా నటించారు త్రిష. ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ లేడీ విలన్స్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒకరు. ఇప్పటికే చాలా సినిమాల్లో లేడీ విలన్‌గా మెప్పించిన వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar) సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’, రవితేజ ‘క్రాక్’, ‘ఉప్పెన’ సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు.  

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) హీరోగా నటించిన ‘నిజం’ సినిమాలో వాంప్‌ క్యారెక్టర్‌‌ చేశారు రాశి. తేజ దర్శకత్వం వహించిన ‘సీత’ సినిమాలో చివరి వరకు కాజల్ నెగెటివ్ క్యారెక్టర్‌‌లోనే కనిపిస్తారు. లారెన్స్ డైరెక్ట్ చేసిన డాన్ సినిమాలో నిఖిత విలన్‌గా నటించారు.

Read More : లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసిన టాప్‌5 హీరోయిన్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!