ప్రభాస్ (Prabhas) బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 4K క్వాలిటీలో ‘బిల్లా’ (Billa Movie) రీరిలీజ్!

Updated on Oct 15, 2022 08:42 PM IST
‘బిల్లా’ (Billa Movie) సినిమా హిందీలో సూపర్ హిట్ సాధించిన ‘డాన్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.
‘బిల్లా’ (Billa Movie) సినిమా హిందీలో సూపర్ హిట్ సాధించిన ‘డాన్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

Hero Prabhas: టాలీవుడ్ లో నయా ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల బర్త్ డే సెలెబ్రేషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు అభిమాన హీరో పుట్టినరోజు నాడు రక్తదానం, అన్నదానం చేసేవారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. పలువురు హీరోల బర్త్ డే సందర్భంగా గతంలో వారు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు.

అయితే, ఈ హంగామాకు నాంది పలికింది మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబే (Mahesh Babu). ఆగస్టు 9న టాలీవుడ్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ‘పోకిరి’ 4కే ను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. అంతేకాదు ఆ సినిమా మంచి ఆదరణ పొందింది. ఇక పోకిరి సినిమా తర్వాత సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా 'జల్సా' (Jalsa) సినిమాను రిలీజ్ చేశారు. అలాగే బాలయ్య నటించిన 'చెన్నకేశవ రెడ్డి' సినిమా కూడా రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేసింది.

ఆగస్టు 9న టాలీవుడ్ మహేష్ బాబు (Mahesh babu) బర్త్ డే సందర్భంగా ‘పోకిరి’ 4కే ను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.

ఈ క్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ 'పోకిరి' (Pokiri) చిత్రంతో నెలకొల్పిన రికార్డు కలెక్షన్స్ పవన్ (Pawan Kalayan) ఫ్యాన్స్ 'జల్సా' కలెక్షన్స్ తో బ్రేక్ చేశారు. దీంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఎత్తున సిద్ధం అవుతున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న 'బిల్లా' మూవీ రీరిలీజ్ కి సన్నద్ధం అవుతున్నారు. అభిమానుల కోరిక మేరకు 'బిల్లా' చిత్ర 4కే ప్రింట్ రెడీ చేశారు. యూవీ క్రియేషన్స్ టీమ్ దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కాగా, ‘బిల్లా’ (Billa Movie) సినిమా హిందీలో సూపర్ హిట్ సాధించిన ‘డాన్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ముగ్గురు హీరోయిన్లు ఇందులో నటించారు. అనుష్క మెయిన్ హీరోయిన్ గా చేయగా, నమిత, హన్సిక కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో బ్రహ్మాండమైన ప్రజాదరణ దక్కించుకున్న ఈ సినిమా 4K క్వాలిటీ రీరిలీజ్ ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ (Hero Prabhas) నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే, పలు పాన్ ఇండియన్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు కూడా చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో హార్రర్ కామెడీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియన్ మూవీ ‘ఆది పురుష్’ (Adi Purush) టీజర్ తాజాగా విడుదల అయ్యింది. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

కాగా, 2023 సంవత్సరం ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్రత్యేకం కానుంది. ఆయన నుండి వచ్చే ఏడాది రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. జనవరిలో ఆదిపురుష్ విడుదల కానుండగా.. సమ్మర్ కానుకగా 'సలార్' (Salaar) విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలున్నాయి.

Read More: 'ఆదిపురుష్' (Adipurush) గురించి ఆసక్తికర వార్త.. హిందీలో ప్రభాస్ కు (Prabhas) డబ్బింగ్ చెప్పింది ఎవరంటే..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!