Kriti Sanon: ప్రభాస్‌తో ప్రేమ, పెళ్లి వార్తలపై స్పందించిన హీరోయిన్ కృతి సనన్.. బాలీవుడ్ బ్యూటీ ఏమన్నారంటే..!

Updated on Nov 30, 2022 11:36 AM IST
రియాల్టీ షోలో వరుణ్ ధావన్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారని.. ఆయన సరదాగా అన్న మాటలు ఎన్నో వార్తలకు నాంది పలికాయని కృతి (Kriti Sanon) అన్నారు
రియాల్టీ షోలో వరుణ్ ధావన్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారని.. ఆయన సరదాగా అన్న మాటలు ఎన్నో వార్తలకు నాంది పలికాయని కృతి (Kriti Sanon) అన్నారు

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon)కు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమా ‘వన్.. నేనొక్కడినే’తోనే ఆమె చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో మహేష్‌తో ఆమె ఆడిపాడారు. ‘వన్’ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనప్పటికీ.. చలాకీ నటన, హుషారైన డ్యాన్సులు, అందంతో యూత్‌ను కట్టిపడేయడంలో కృతి సక్సెస్ అయ్యారు. దీంతో ఆమెకు అక్కినేని వారసుడు నాగ చైతన్యకు జోడీగా ‘దోచెయ్’ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం లభించింది. అయితే ఈ మూవీ కూడా ఆమెకు చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. 

‘వన్.. నేనొక్కడినే’, ‘దోచెయ్’ పరాజయం పాలవ్వడంతో కృతి తన మకాంను ముంబైకి మార్చారు. అయితే అక్కడ ఆమెకు మంచి చాన్సులే దక్కాయి. ‘హీరోపంతి’, ‘దిల్‌వాలే’, ‘బరేలీ కీ బర్ఫీ’, ‘లుక్కా చుప్పీ’, ‘స్త్రీ’, ‘మిమి’ లాంటి సినిమాలు హిందీ చిత్ర పరిశ్రమలో కృతిని అగ్ర హీరోయిన్ల లిస్టులో చేర్చాయి. ఈ విషయాన్ని పక్కనబెడితే.. కృతి సనన్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

ఓ స్టార్ హీరోతో కృతి సనన్ ప్రేమలో ఉన్నారని ఆంగ్ల పత్రికల్లోనూ వరుస కథనాలు దర్శనమిచ్చాయి. దీంతో ఈ విషయంపై తాజాగా ఆమె స్పందించారు. అవన్నీ వదంతులు మాత్రమేనని కృతి కొట్టిపారేశారు. ‘ఆ రియాల్టీ షోలో మన ‘భేడియా’ (వరుణ్ ధావన్) కాస్త అత్యుత్సాహం కనబరిచారు. ఆయన సరదాగా అన్న మాటలు ఇప్పుడు ఎన్నో వార్తలకు నాంది పలికనట్లయ్యింది. కొన్ని వెబ్‌సైట్లు నా పెళ్లి తేదీని ప్రకటించడానికి ముందే వీటికి నేను ఫుల్‌స్టాప్ పెడుతున్నా. వాటిల్లో ఎలాంటి నిజం లేదు’ అని కృతి సనన్ క్లారిటీ ఇచ్చారు. 

ప్రభాస్‌తో కృతి డేటింగ్‌లో ఉన్నారని.. ఇద్దరూ తర్వలో పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని వెబ్‌సైట్లు కూడా వార్తలు ప్రచురించాయి

ఇకపోతే, కృతి సనన్, వరుణ్ ధావన్ (Varun Dhawan) నటించిన ‘భేడియా’ (Bhediya) చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ టెలివిజన్ షోలో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘కృతి సనన్ పేరు నా జాబితాలో లేదు. ఆమె పేరు మరొకరి హృదయంలో ఉంది. ఆ వ్యక్తి ప్రస్తుతం ముంబైలో లేడు. వేరే చోట దీపికా పదుకొణెతో కలసి షూట్‌లో ఉన్నాడు’ అంటూ వరుణ్ కామెంట్ చేశారు. వీటిని చూసిన నెటిజన్స్ వరుణ్ మాట్లాడుతున్నది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించేనని భావించారు. ప్రభాస్‌తో కృతి డేటింగ్‌లో ఉన్నారని.. ఇద్దరూ తర్వలో పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని వెబ్‌సైట్లు వార్తలు కూడా ప్రచురించాయి. దీంతో ప్రభాస్ (Prabhas) అభిమానులు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సినిమా ప్రమోషన్స్ కోసం మా హీరోను ఎందుకు వీటిల్లోకి లాగుతున్నారు’ అని మండిపడ్డారు. మొత్తానికి ఈ విషయంపై కృతి స్పష్టత ఇచ్చేశారు. 

కాగా, ప్రభాస్–కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush). బాలీవుడ్ దర్శక, నిర్మాత ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. దాదాపు రూ.500 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో ‘ఆదిపురుష్’ను విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, హిందీతోపాటు మరికొన్ని స్వదేశీ, విదేశీ భాషల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. 

Read more: స్పెషల్ సాంగ్స్‌లో నర్తించి అభిమానులను అలరించిన టాప్‌–5 హీరోయిన్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!