Unstoppable 2: ‘అన్‌స్టాపబుల్’ షోలో పాన్ ఇండియా స్టార్!.. గోపీచంద్‌తో కలసి పాల్గొననున్న ప్రభాస్ (Prabhas)?

Updated on Dec 02, 2022 11:24 AM IST
‘అన్‌స్టాపబుల్’ షో (Unstoppable 2)లో గోపీచంద్‌తో కలసి ప్రభాస్ పాల్గొంటారని.. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ను ఈ నెల 11న షూట్ చేస్తారని వినికిడి
‘అన్‌స్టాపబుల్’ షో (Unstoppable 2)లో గోపీచంద్‌తో కలసి ప్రభాస్ పాల్గొంటారని.. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ను ఈ నెల 11న షూట్ చేస్తారని వినికిడి

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో ప్రసారమయ్యే ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable 2) షో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులతోపాటు దర్శకులు, నిర్మాతలు గెస్టులుగా పాల్గొంటున్న ఈ షోకు ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’.. నంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. దీంతో ఇదే ఉత్సాహంతో ఇటీవలే సీజన్ 2ను ప్రారంభించారు. రెండో సీజన్‌లో సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొంటుండటం విశేషం. 

సాధారణంగా టాక్ షోలకు స్టార్ హీరోలు దూరంగా ఉంటారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ అందుకు ‘అన్‌స్టాపబుల్’ షో అతీతమనే చెప్పాలి. ఇప్పటికే ఈ షోలో అల్లు అర్జున్, శర్వానంద్, అడివి శేష్ లాంటి హీరోలతోపాటు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్​, మెగాస్టార్ చిరంజీవిని కూడా ఈ షోకు రప్పించేందుకు ‘ఆహా’ యూనిట్ ప్లాన్ చేస్తోందని వార్తలు వచ్చాయి. వీరి తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్​ రామ్‌లతో కలిపి ఒక ఎపిసోడ్ చేయనున్నారని కూడా రూమర్స్ వినిపించాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. 

 ప్రభాస్ (Prabhas) కాల్షీట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆయన ఎప్పుడు పాల్గొంటారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదట

ఇలాంటి తరుణంలో ఓ స్టార్ హీరో బాలయ్య షోకు రానున్నారని వినికిడి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలో ‘అన్‌స్టాపబుల్’ షోలో పాల్గొంటారని సమాచారం. యాక్షన్ హీరో గోపీచంద్‌తో కలసి ప్రభాస్ ఈ షోకు రాబోతున్నారట. అయితే ప్రభాస్ (Prabhas) కాల్షీట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆయన ఎప్పుడు పాల్గొంటారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదట. మరోవైపు డిసెంబర్ 11న ప్రభాస్–గోపిచంద్ ఎపిసోడ్ షూట్ చేస్తారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మరో ఆసక్తికర ఎపిసోడ్‌కు అంతా సిద్ధమవుతోందనే భావించాలి. ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్న డార్లింగ్.. ‘అన్‌స్టాపబుల్’లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారనేది ‘ఆహా’ సంస్థకే తెలియాలి. 

Read more: Poonam Kaur: అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి పూనమ్ కౌర్!.. చికిత్స కోసం కేరళకు వెళ్లారన్న వార్తల్లో నిజమెంత..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!