Tollywood: ఈ ఏడాది రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం..

Updated on Nov 25, 2022 04:57 PM IST
2022లో విడుదలైన పలు టాలీవుడ్ (Tollywood) సినిమాలు రూ. 100 కోట్లకు పైగా వసూళ్ల చేశాయి. 'ఆర్ఆర్ఆర్' చిత్రం దాదాపు రూ.1200 కోట్లను వసూళ్లు చేసింది.
2022లో విడుదలైన పలు టాలీవుడ్ (Tollywood) సినిమాలు రూ. 100 కోట్లకు పైగా వసూళ్ల చేశాయి. 'ఆర్ఆర్ఆర్' చిత్రం దాదాపు రూ.1200 కోట్లను వసూళ్లు చేసింది.

టాలీవుడ్‌ (Tollywood) కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ ఏడాదిలో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఏకంగా వేయి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసి చరిత్ర సృష్టించింది. 92 ఏళ్ల తెలుగు చిత్ర రంగంలో ఎన్నడూ రాని కలెక్షన్లు 'ఆర్ఆర్ఆర్' రాబట్టింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు 2022లో విడుదలైన పలు తెలుగు సినిమాలు వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. రూ.100 కోట్ల బిజినెస్ చేసిన టాలీవుడ్ సినిమాలపై పింక్ విల్లా ప్రత్యేక కథనం. 

ఆర్ఆర్ఆర్ (RRR)

రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) – రూ.1135 కోట్లు

'రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్) (RRR) సినిమా యాక్షన్ ఎంటర్‌టైన్ చిత్రంగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించారు. ఈ సినిమా 2022 మార్చి 25 తేదీన విడుదలైంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీముడిగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు దేశం కోసం పోరాటం చేసే పాత్రలో ఒదిగిపోయారు. 

'ఆర్ఆర్ఆర్' విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా రూ.1135 కోట్లను రాబట్టింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఆర్ఆర్ఆర్ ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 'ఆర్ఆర్ఆర్' వంద రోజులు సక్సెస్ ఫుల్‌గా ఆడి మరో రికార్డును సొంతం చేసుకుంది. 

ఈ సినిమాలో బాలీవుడ్ నటి అలియా భట్, శ్రియా. అజయ్ దేవగణ్,పి సముద్రఖని, రే స్టీవెన్సన్‌, ఓలివియా మోరీస్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. 'ఆర్ఆర్ఆర్' కథను ర ాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాశారు. 

సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)

సర్కారు వారి పాట – రూ.178 కోట్లు

మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్‌టైన్ చిత్రంగా 2022 మే 12 తేదీన విడుదలైంది. మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటించారు. 'సర్కారు వారి పాట' విడుదలైన మొదటి రోజు నుంచి మంచి వసూళ్లను రాబట్టింది. పరశురామ్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ చిత్రం రూ. 178 కోట్లు వసూళ్ల చేసింది. 

'సర్కారు వారి పాట'సినిమాను మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకి సంగీతం థమన్ ఎస్ అందించారు.

భీమ్లా నాయక్

భీమ్లా నాయక్ – రూ.161 కోట్లు

మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌గా 'భీమ్లా నాయక్' తెరకెక్కించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్ తదితరులు నటించారు. సాగర్ కె చంద్ర వహించారు. నిర్మాత నాగ వంశి నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. 2022 ఫిబ్రవరి 25 తేదీన విడుదలైన 'భీమ్లా నాయక్' రూ.161 కోట్లు వసూళ్లు చేసింది. 

రాధే శ్యామ్

రాధే శ్యామ్ – రూ.151 కోట్లు

'రాధే శ్యామ్' రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. 2022 మార్చి 11 తేదీన విడుదలైన ఈ సినిమాకు దర్శకుడు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రభాస్, పూజా హెగ్డే, సచిన్ కేడెకార్, భాగ్య శ్రీ, మురళి శర్మ, సాషా సషా చేత్రి, ప్రియదర్శి, సత్యన్, కునాల్ రాయ్ కపూర్ నటించారు. నిర్మాతలు ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి కలిసి నిర్మించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించారు. 'రాధే శ్యామ్' చిత్రాన్ని రూ. 350 కోట్లతో నిర్మించారు. ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిన కలెక్షన్ల పరంగా వంద కోట్లకు పైగా వసూళ్లు చేసింది. 

ఎఫ్3

ఎఫ్ 3 – రూ.129 కోట్లు

'ఎఫ్ 3' సినిమా కామెడి ఎంటర్టైనర్ చిత్రంగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు. 'ఎఫ్2' సినిమాకు సీక్వెల్‌గా చిత్రీకరించిన 'ఎఫ్3' ఈ ఏడాది మే 27 తేదీన రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచి రూ.129 కోట్లు వసూళ్లు చేసింది. 

కార్తికేయ 2

కార్తికేయ 2 – రూ.120 కోట్లు

'కార్తికేయ 2' సినిమా సస్పెన్స్‌ థ్రిల్లర్ సినిమాగా ఇండియా లెవల్‌లో హిట్ అయింది.  నిఖిల్ సిద్దార్థ్, అనుపమ, శ్రీనివాస్ రెడ్డి, సత్య అక్కల, ప్రవీణ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం చందు మొండేటి వహించారు. నిర్మాతలు టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందించారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని 2022 ఆగస్టు 13 తేదీన విడుదలైన 'కార్తికేయ 2' చిత్రం రూ.120 కోట్లు వసూళ్లు చేసింది.

గాడ్ ఫాదర్

గాడ్ ఫాదర్ – రూ.106 కోట్లు

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ (God Father) తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరి, సత్య దేవ్, మురళి శర్మ, సునీల్ నటించారు. 'గాడ్ ఫాదర్' సినిమాకు దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. నిర్మాతలు ఎన్ వి ప్రసాద్, రామ్ ప్రసాద్ నిర్మించారు. సంగీతం ఎస్ థమన్ అందించారు. అక్టోబర్ 5 తేదీన రిలీజ్ అయిన 'గాడ్ ఫాదర్' సినిమా దాదాపు రూ.106 కోట్లు వసూళ్లు చేసింది. 

Read More: ‘ఆదిత్య 369’ నుంచి ‘బింబిసార’ వరకు.. టాలీవుడ్‌ (Tollywood) టైమ్ ట్రావెల్ జోనర్ సినిమాలు

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!